OTT Theatre Movies : ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. అక్కడ అఖిల్.. ఇక్కడ ప్రియాంక

AKhil Agent Release Date అఖిల్ ఏజెంట్ సినిమా, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌ రెండో పార్ట్ ఈ వారం థియేటర్లోకి వస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ చిత్రాలు థియేటర్లోకి వస్తుండగా.. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2023, 03:41 PM IST
  • ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి
  • థియేటర్లోకి ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్‌
  • ఓటీటీలో ప్రియాంక చోప్రా సిటాడెల్
OTT Theatre Movies : ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. అక్కడ అఖిల్.. ఇక్కడ ప్రియాంక

OTT Theatre Movies ఈ వారం ఓటీటీలో మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతోన్నాయి. అయితే ఓటీటీలోనే కాకుండా థియేటర్లో భారీ బడ్జెట్ సినిమాలు రాబోతోన్నాయి. తెలుగులో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా రాబోతోండగా.. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ రాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతోంది. అలా ఈ వారం థియేటర్లో ఈ రెండు సినిమాల హవానే కొనసాగనుంది. ఇక ఓటీటీలో అయితే ప్రియదర్శి, నాని, ప్రియాంక చోప్రా వంటి వారు సందడి చేయబోతోన్నారు.

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో గత రెండు మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాలో మమ్ముట్టి ముఖ్య పాత్రను పోషించాడు. అఖిల్‌కు జోడి సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీతో అఖిల్‌ థియేటర్లో సందడి చేయబోతోన్నాడు.

కోలీవుడ్‌ ప్రతిష్టాత్మకమైన సినిమా పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే మొదటి పార్ట్ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో పార్ట్ మీద ఎలాంటి అంచనాలు గానీ ఆసక్తి గానీ లేదు. దీంతో బయ్యర్లు ఎవ్వరూ కూడా ఈ సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదట. ఈ మూవీ అయితే ఏప్రిల్ 28న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

ఏప్రిల్ 27న అమెజాన్‌లో శింబు నటించిన పత్తుతల సినిమా రాబోతోంది.ఇక ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్‌లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్‌లో దసరా సినిమా ఏప్రిల్ 27 నుంచి రానుంది. డిస్నీ హాట్ స్టార్‌లో ప్రియదర్శి నటించిన సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నందితా శ్వేత నటించిన రారా పెనిమిటీ అనే చిన్న సినిమా థియేటర్లోకి రానుంది. జీ5 యాప్‌లో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. ఇందులో హెబ్బా పటేల్, సంపత్ రాజ్ వంటి వారు నటించారు.

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News