Akdi Pakdi: అకిడి పకిడి సాంగ్లో డ్యాన్స్ తో రచ్చ రేపిన విజయ్ దేవరకొండ, అనన్య

Akdi Pakdi song promo: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ నుంచి  అకిడి పకిడి అంటూ సాగుతున్న సాంగ్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 05:47 PM IST
  • విజయ్ దేవరకొండ-పూరీ కామ్బోలో లైగర్
  • అకిడి పకిడి అంటూ సాగుతున్న సాంగ్ ప్రోమో విడుదల
  • ఆకట్టుకున్న ప్రోమో
Akdi Pakdi: అకిడి పకిడి సాంగ్లో డ్యాన్స్ తో రచ్చ రేపిన విజయ్ దేవరకొండ, అనన్య

Akdi Pakdi song promo From Liger movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ ఒక కిక్ బాక్సింగ్ ఛాంపియన్గా కనిపించబోతున్నాడు.అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. 

ఇప్పటి వరకు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నది ఎవరు అనే విషయం మీద ఏమాత్రం క్లారిటీ ఇవ్వని సినిమా యూనిట్ తాజాగా ఏకంగా ఫస్ట్ సింగిల్ విడుదల చేసి షాక్ ఇచ్చింది. అనన్య పాండే విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందించిన అకిడి పకిడి అంటూ సాగుతున్న సాంగ్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. అనన్య విజయ మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా కుదిరిందని సాంగ్ ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది. తనదైన మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించడానికి విజయ్ ప్రయత్నం చేశాడు. 

ఇక పాట మొత్తం కూడా పూరి జగన్నాథ్ మార్కుతో కనిపిస్తుంది. ఇప్పటికే పలు పోస్టర్లు,  టీజర్లతో సినిమా మీద ఆసక్తి పెంచడానికి ప్రయత్నిస్తున్న పూరి ఈ కొత్త సాంగ్ టీజర్ తో మరింత ఆసక్తి పెంచాడనే చెప్పాలి,  ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతానికి విడుదల చేయగా పూర్తి సాంగ్ జూలై 11న విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ అకిడి పకిడి పాట హిందీ వర్షన్ లిరిక్స్ మోహ్‌సిన్‌ షైక్‌,  అజీమ్‌ దయాని అందించగా లిజియో జార్జ్‌ సంగీతం అందించారు. ఇక తెలుగులో అనురాగ్ కులకర్ణి,  రమ్య బెహరా ఆలపించిన ఈ సాంగ్ కి భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి కౌర్ తో కలిసి కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ,  బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

సాంగ్ ప్రోమో ఇక్కడ చూడండి: అకిడి పకిడి ప్రోమో
Also Read: Actor VK Naresh Assets: నరేష్ ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా.. తెలిస్తే షాకవ్వాల్సిందే!

Also Read: Hero Vikram Hospitalized: హీరో విక్రమ్ కు గుండెపోటు కాదు.. అసలు ఏం జరిగిందో తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News