Akash Puri Responds on His Parent's Divorce: స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా ఎంత క్రేజ్ ఉందో పర్సనల్ గా ఆయనకు హీరోయిన్ ఛార్మీకి కూడా ఏదో ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద వారు ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పూరీ కనెక్స్ట్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. పూరి చేస్తున్న అన్ని సినిమాలు కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మీ నిర్మాతగా రామ్ తో ఇష్మార్ట్ శంకర్, దేవరకొండతో ‘లైగర్’, జనగణమణ సినిమాలు నిర్మిస్తున్నారు.
పూరీ ఛార్మీ సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. దానిలో భాగంగా.. పూరీ భార్య లావణ్యకి విడాకులు ఇవ్వబోతున్నారంటూ పుకార్లు వినిపించడంతో ఆ పుకార్లపై పూరీ కొడుకు ఆకాష్ పూరీ ఓపెన్ అయ్యారు. ఆకాష్ హీరోగా తెరకెక్కిన ‘చోర్ బజార్’ ఈనెల 24 థియేటర్స్‌లో విడుదల కానుంది. జార్జ్ రెడ్డి దర్శకుడు జీవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆకాష్ పూరీకి పూరీ విడాకుల గురించి ప్రశ్నలు తలెత్తడంతో వాటిపై మొట్టమొదటి సారిగా రియాక్ట్ అయ్యారు. మా నాన్న పరిస్థితి అస్సలు బాలేనప్పుడు.. ఆ విషయాలు మాకు తెలియకుండా అమ్మ ముందే జాగ్రత్తపడిందని ఆకాష్ చెప్పుకొచ్చాడు.
మేం బాగా చిన్నపిల్లలగా ఉన్నప్పుడే హాస్టల్లో పెట్టేయడంతో ఇవేం తెలియక చాలా హ్యాపీగా ఉన్నామని పేర్కొన్నారు. మా నాన్న పెద్ద డైరెక్టర్.. మేం హ్యాపీ అనే ఫీలింగ్‌లో ఉన్నాము కానీ కొన్నాళ్ల తరువాత మాకు పరిస్థితి అర్ధమైందని చెప్పుకొచ్చాడు. అన్నీ పోయాక మా నాన్న తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం అద్భుతమని, అది ఎవరికీ సాధ్యం కానిదని అన్నారు. నాన్న అలా మళ్లీ నిలబడ్డారు అంటే అది మమ్మీ వల్లే అని చెప్పుకొచ్చాడు. అసలు విడాకులు తీసుకునే స్టేజ్ వచ్చేసిందని రూమర్స్ రావడం కూడా నాకు తెలియదని ఎందుకంటే వాళ్ల మధ్య అలాంటి గొడవలు ఎప్పుడూ రాలేదని అన్నాడు.
విడాకులు తీసుకుంటున్నారని రాసేవాళ్లకి అది టైం పాస్.. న్యూస్ క్రియేట్ చేయాలని అలా రాస్తుంటారని చెప్పుకొచ్చాడు. ఒకవేళ అది నిజం అయ్యి ఉంటే.. ఇప్పటికీ వాళ్లు కలిసి ఉండేవారు కాదు కదా అంటూ ఎదురు ప్రశ్నించాడు ఆకాష్. నాన్న జేబులో 200 రూపాయలు ఉన్న రోజున ఆయన మీద నమ్మకంతో వచ్చిన ఆమె విడాకులు ఎందుకు ఇస్తుంది అని ప్రశ్నించాడు. ఇక హీరోగా నిలదొక్కుకోవడం కోసం ఆకాష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చివరిగా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది వర్కౌట్ కాలేదు.
Also Read:Telugu Cine workers : ఇప్పుడు వస్తున్నది ఎంత.. డిమాండ్ చేస్తున్నది ఎంతంటే?
Also Read: Chinmayi Sripada: కవలలకు తల్లైన వివాదాస్పద సింగర్.. సరోగసీ కామెంట్స్ పై ఏమందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook