Mercy Killing: మెర్సి కిల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ఆకాష్ పూరి..ఆర్టికల్ 21 ఆధారంగా రానున్న చిత్రం !!!

Akash Puri: మెర్సి కిల్లింగ్ అనే తెలుగు చిత్రం సరికొత్త కథతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా మొదటి లుక్ ని అలానే మోషన్ పోస్టర్ని విడుదల చేశాడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2024, 05:58 PM IST
Mercy Killing: మెర్సి కిల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ఆకాష్ పూరి..ఆర్టికల్ 21 ఆధారంగా రానున్న చిత్రం !!!

Mercy Killing
సరికొత్త కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమా మెర్సీ కిల్లింగ్. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో రానున్న ఈ చిత్రాన్ని 
సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఎక్కిస్తున్నారు. సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. 

సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతున్న సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, టాలీవుడ్ యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. 

ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆకాష్ పూరి మాట్లాడుతూ…’మెర్సి కిల్లింగ్ టైటిల్ వింటేనే నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఈ సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉంది, మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా వచ్చేనెల ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలియజేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన సినిమా మెర్సీ కిల్లింగ్. ఈ సినిమాలో ఆర్టికల్ 21 గురించి ఎంతో చక్కగా చెప్పబోతున్నారు దర్శకుడు.
స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ ఈ ఈవెంట్ సందర్భంగా తెలియజేశారు. 

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు,ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్,  సూర్య, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ గా కపిల్ బల్ల వ్యవహరిస్తుండగా వై నరేష్ కుమార్ మాటలు అందించారు.

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News