Ajay Devgn purchases new bungalow: రూ. 60 కోట్లతో బంగ్లా కొన్న అజయ్ దేవ్‌గన్

Ajay Devgn purchases new bungalow in Mumbai: బాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే అందుకు కారణం అతడి లేటెస్ట్ సినిమాలు అనుకుంటే పొరపాటే. అజయ్ దేవ్‌గన్ తాజాగా కొనుగోలు చేసిన ఓ బడా బంగ్లా అతడిని ఇప్పుడు వార్తల్లోకెక్కేలా చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2021, 06:52 AM IST
Ajay Devgn purchases new bungalow: రూ. 60 కోట్లతో బంగ్లా కొన్న అజయ్ దేవ్‌గన్

Ajay Devgn purchases new bungalow in Mumbai: బాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే అందుకు కారణం అతడి లేటెస్ట్ సినిమాలు అనుకుంటే పొరపాటే. అజయ్ దేవ్‌గన్ తాజాగా కొనుగోలు చేసిన ఓ బడా బంగ్లా అతడిని ఇప్పుడు వార్తల్లోకెక్కేలా చేసింది. అవును ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జుహూలో అజయ్ దేవ్‌గన్ ఓ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశాడు. ఆ బంగ్లా ఖరీదు అక్షరాల రూ. 60 కోట్లు (Ajay Devgn's new bungalow cost). అజయ్ దేవ్‌గన్ కొన్న బంగ్లా వైశాల్యం 590 చదరపు గజాలు. 

గత ఏడాది కాలంగా తనకు నచ్చిన విధంగా ఉన్న ఓ ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న అజయ్ దేవ్‌గన్‌కి ఎట్టకేలకు తాను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలోనే ప్యాలెస్ లాంటి బంగ్లా కనబడిందట. ఇంకేం వెంటనే ఆ బంగ్లాను సొంతం చేసుకున్నాడు. అమితాబ్ బచ్చన్, ధర్మేంధ్ర, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది ఇప్పుడు అజయ్ దేవ్‌గన్‌కి (Ajay Devgn's new bungalow) ఇరుగుపొరుగు అన్నమాట.

Also read : Pushpa తర్వాత డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీకి Allu Arjun ప్లాన్స్ ?

బాలీవుడ్‌లో కష్టపడి పైకొచ్చిన నటుల్లో అజయ్ దేవ్‌గన్‌ ఒకరు. అజయ్ దేవ్‌గన్‌ తండ్రి వీరు దేవ్‌గన్ (Ajay Devgn's father Veeru Devgn). బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ కూడా అయిన వీరు దేవ్‌గన్‌కి ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గానే ఎక్కువ పేరు వచ్చింది. వీరు దేవ్‌గన్‌కి వారసుడిగానే సినిమాల్లోకి వచ్చినప్పటికీ... తనకంటూ ఓ సెపరేటు స్టైల్ ఏర్పాటు చేసుకుని సొంత కష్టంతో పైకొచ్చిన నటుల్లో ఒకరిగా అజయ్ దేవ్‌గన్ (Ajay Devgn's bollywood entry) పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కాజోల్‌తో ప్రేమాయణం, పెళ్లి సంగతి (Kajol love story with Ajay Devgn) అందరికీ తెలిసిందే.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీతో (RRR movie) తొలిసారిగా ఓ స్ట్రెయిట్ సౌతిండియన్ సినిమా చేస్తున్న అజయ్ దేవ్‌గన్ ఆ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

Also read : Driving Licence Telugu remake: ప్లాన్ మార్చిన రామ్ చరణ్.. Pawan Kalyan స్థానంలో రవితేజ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News