Raid Sequel: వరస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ కి ప్రస్తుతం తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ అవసరం. అందుకే తన ఆశలన్నీ తదుపరి ప్రాజెక్టుల పైన పెట్టుకున్నారు ఈ హీరో. రవితేజ రాబోతున్న చిత్రాలలో మొదటగా విడుదలయ్యే సినిమా ఈగల్. అన్నీ పనులు పూర్తి చేసుకొని ఈ సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చేద్దాం అనుకునింది ఈ చిత్రం. కానీ మరో నాలుగు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ కి వస్తూ ఉన్న కారణంగా.. నిర్మాతల నిర్ణయం ఒప్పుకొని వెనక్కి తగ్గి ఫిబ్రవరి 9కి విడుదల తేదీ వాయిదా వేసుకునింది.
ఇక ఈగల్ సినిమా తరువాత రవితేజ ఒప్పుకున్న మరో చిత్రం మిస్టర్ బచ్చన్. తనకు మిరపకాయ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఈ చిత్రం చేయనున్నారు మాస్ మహారాజా. కాగా ఈ చిత్రం హిందీ సినిమా రైడ్ కి రీమేక్ గా తెరకెక్కనుంది.
2018లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా 1980ల్లో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా ‘రైడ్’ సినిమా తెరకెక్కింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ కి వస్తే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి..అతన్ని ఆ రాజకీయ నాయకుడు ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. కాగా మళ్లీ ఐదు సంవత్సరాల తరువాత ఈ సినిమాని తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో తీస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. అయితే ఓ పక్క రవితేజ రైడ్ రీమేక్ చేస్తుంటే తాజాగా ఈ చిత్రం హిందీలో నటించిన హీరో అజయ్ దేవగణ్ రైడ్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. నేడు రైడ్ 2 టైటిల్ తోనే పోస్టర్ కూడా విడుదల చేసి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని కూడా రాజ్ కుమార్ గుప్తా తెరెక్కిస్తున్నారు.
ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఈ ఓపెనింగ్ పూజా కార్యక్రమాలకు హరీష్ శంకర్.. రవితేజ కూడా హాజరయ్యారు. నేడు ఉదయం ఈ ఇద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి ముంబాయికి ఈ రైడ్ పూజా కార్యక్రమాలు అటెండ్ అవ్వడానికి వెళ్లారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ రైడ్ 2 సినిమాని 2024 నవంబర్ 15 విడుదల చేస్తామని చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఆ లోపు రవితేజ మిస్టర్ బచ్చన్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఒకవేళ రైడ్ సినిమా తెలుగులో మంచి విజయం సాధిస్తే రవితేజ రైడ్ 2ని కూడా రీమేక్ చేస్తాడా? లేదా రైడ్ 2 నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుందా లాంటి ప్రశ్నలకు జవాబు తెలియాలి అంతే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా
Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook