Anil Ravipudi: నేను కొత్త పార్టీ పెడుతున్నాను…అనిల్ రావిపూడి పొలిటికల్ వీడియో వైరల్

Anil Ravipudi viral video : తనదైన కామెడీ సినిమాలతో మనందరినీ అల్లరించిన దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా అలాంటి దర్శకుడు ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీ అంటూ పెట్టిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి ఏంటి ..పొలిటికల్ పార్టీ ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఆ సంగతేంటో ఒకసారి చూద్దాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 10:44 AM IST
Anil Ravipudi: నేను కొత్త పార్టీ పెడుతున్నాను…అనిల్ రావిపూడి పొలిటికల్ వీడియో వైరల్

Anil Ravipudi political party : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న దర్శకులలో రాజమౌళి తరువాత అలా ఫ్లాపులు లేకుండా తన కెరీర్ కొనసాగిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తీసిన సినిమాలు రాజమౌళి సినిమాల లాగా బ్లాక్ బస్టర్ కాకపోయినా ఏ సినిమా కానీ డిజాస్టర్ గా మాత్రం మిగల్లేదు. ఎఫ్ 3 సినిమా పరవాలేదు అనిపించుకోగా మిగతా సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ మధ్య తన కామెడీ మార్క్ పక్కనపెట్టి బాలకృష్ణతో ఎమోషన్స్ తో కూడిన సినిమా భగవంత్ కేసరి తీసి .. ఆ చిత్రంతో కూడా మంచి హిట్ అందుకున్నారు ఈ డైరెక్టర్.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

కాగా ఇప్పుడు ఈ దర్శకుడు తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఊహించని క్లిప్ ఆయన అభిమానులను అర్థం కాని పరిస్థితిలో పడేసింది. అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలో, అనిల్ రావిపూడి, రాజకీయ నాయకుడి వేషధారణలో కెమెరాను ఉద్దేశించి సీరియస్‌గా ప్రసంగించారు. ఈ వీడియో నెటిజన్లలో గందరగోళాన్ని రేకెత్తించింది. అనిల్ రావిపూడి ఈ వీడియోలో చమత్కారంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

‘నేను బాక్సాఫీస్ విజయాన్ని రుచి చూశాను, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. నేను కొత్త పార్టీ పెడుతున్నాను. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తాను' అని అనిల్ రావిపూడి వెల్లడించారు.

అయితే ఈ వీడియో షేర్ చేసింది అనిల్ రావిపూడి కాదు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వారు. దీన్ని బట్టి చూస్తే ఆహా లో అనిల్ రావిపూడి ఏదో ఒక పొలిటికల్ వెబ్ షో లేదా వెబ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ దాని గురించి పూర్తి వివరాలు మాత్రం అనిల్ అలానే ఆహా వారు గోప్యంగా ఉంచారు. కాబట్టి అసలు ఎందుకు ఈ వీడియో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

 

Trending News