Pavitra Lokesh: నరేష్-పవిత్రలది ప్రేమ బంధం కాదట.. కరెన్సీ బంధమట.. ఎందుకో తెలుసా?

Agreement Between Pavitra Lokesh And Actor Naresh: సహజీవనంలో ఉన్నారని భావిస్తున్న పవిత్ర లోకేష్, నటుడు నరేష్ లకు సంబంధించి  ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 09:55 AM IST
Pavitra Lokesh: నరేష్-పవిత్రలది ప్రేమ బంధం కాదట.. కరెన్సీ బంధమట.. ఎందుకో తెలుసా?

Agreement Between Pavitra Lokesh And Actor Naresh: కొన్నాళ్ల క్రితం వరకు నటి పవిత్ర,  అలాగే నటుడు నరేష్ కి సంబంధించిన వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నరేష్ కు ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు కాగా ఆ మూడూ విఫలమయ్యాయి. ప్రస్తుతానికి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు పొందేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పవిత్ర లోకేష్ కి కూడా గతంలోనే ఒక వివాహం జరిగింది. సుచేంద్ర ప్రసాద్ అనే కన్నడ నటుడితో ఆమెకు వివాహం జరగగా వారికి ఇద్దరు మగ సంతానం కూడా ఉన్నారు.

అయితే ఇద్దరూ కూడా తమ తమ భార్యాభర్తలకు దూరంగా ఉండడంతో దగ్గరయ్యారని సహజీవనం కూడా చేస్తున్నారనే ప్రచారం ముందు నుంచి జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక కన్నడ మీడియా సంస్థ పవిత్ర లోకేష్ తో స్టింగ్ ఆపరేషన్ జరిపించగా అందులో ఆమె తాను నరేష్ తో సహజీవనం చేస్తున్న మాట నిజమేనని మా బంధానికి కృష్ణ కుటుంబం నుంచి కూడా సపోర్ట్ ఉందని తాను నరేష్ కృష్ణ ఫామ్ హౌస్ లో జీవిస్తున్నామని పవిత్ర చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అది స్టింగ్ ఆపరేషన్ అని తెలిసి ఆమె మాట మార్చారు,  అది వేరే విషయం.

తర్వాత నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం,  మీడియా ముందు అనేక ఆరోపణలు చేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఈ ఇద్దరినీ మైసూర్లో ఒక హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియా ముందు రమ్య రఘుపతి రచ్చ రచ్చ చేశారు. ఆ తరువాత పవిత్ర లోకేష్ అలాగే నరేష్ కి సంబంధించిన ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. కానీ తాజాగా ఒక సరికొత్త ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అదేమిటంటే పవిత్ర లోకేష్,  నరేష్ మధ్య ప్రేమ బంధం కంటే కరెన్సీ బంధమే గట్టిగా ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ఒకరిని వివాహం చేసుకొని ఆయనకు దూరమైన పవిత్ర లోకేష్ తాను నరేష్ తో సహజీవనం చేయాలి అంటే నెలకు పాతిక లక్షల రూపాయలు అందుకు చెల్లించాలని అగ్రిమెంట్ చేసుకున్నారట.  ఒకవేళ నరేష్ తనతో సహజీవనం చేస్తూ వేరే అమ్మాయితో అఫైర్ ఉన్నట్లు తెలిసినా లేదా తనతో పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు 50 కోట్లు సింగిల్ సెటిల్మెంట్లో చెల్లించాలని ఆ అగ్రిమెంట్లో ఉందట. లేటు వయసులో ప్రేమ కలగకూడదా? ప్రేమగా మాట్లాడే వ్యక్తులతో కాస్త సన్నిహితంగా ఉండకూడదా అని నరేష్ అడిగిన ప్రశ్నలకు,  ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వార్తలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి మరి.. 
Also Read: Nikhil Siddarth: కార్తికేయ 2 విషయంలో విలన్ దిల్ రాజు కాదు.. అసలు విషయం బయట పెట్టిన నిఖిల్

Also Read: Zee Saregamapa: శృతిక సముద్రాల చేతికి ‘జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్.. కళ్లు చెదిరే బహుమతులు కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News