Adipurush Collections: ఆదిపురుష్‌ కలెక్షన్లకు మేకర్స్ తిప్పలు.. 3D టిక్కెట్ రేట్లు తగ్గింపు.. కానీ!

Adipurush 3D Ticket Price Reduced: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు మేకర్స్ తిప్పలు పడుతున్నారు. 3D టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 150 రూపాయలకు నేడు, రేపు సినిమా చూడొచ్చని తెలిపారు. అయితే అన్ని చోట్ల ఈ ఆఫర్ వర్తించదు.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 24, 2023, 10:20 AM IST
Adipurush Collections: ఆదిపురుష్‌ కలెక్షన్లకు మేకర్స్ తిప్పలు.. 3D టిక్కెట్ రేట్లు తగ్గింపు.. కానీ!

Adipurush 3D Ticket Price Reduced: భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంటోంది. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా.. సినిమా తీసిన తీరుపై మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు చిత్ర రచయిత చేస్తున్న కామెంట్స్ అగ్ని ఆజ్యం పోసినట్లు అభిమానులను మరింత రెచ్చగొడుతున్నాయి. తాము రామయణం సినిమా తీయలేదని ఒకసారి.. హనుమంతుడు దేవుడు కాదంటూ మరోసారి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. 

తొలి రోజు మూడురోజులు మూడు వందల కోట్లు రాబట్టగా.. నాలుగు, ఐదో రోజు ప్రజలు థియేటర్ల వైపు రావడం మానేశారు. మొత్తం ఐదో రోజులకు కలిపి రూ.350 వరకు రాబట్టింది. సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. డైరెక్టర్ ఓం రౌత్‌ను నమ్మి మేకర్స్ నిండా మునిగిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. 

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఆదిపురుష్ మేకర్స్ సరికొత్త ప్లాన్ వేశారు. 'ఆదిపురుష్' 3D టిక్కెట్లు కేవలం రూ.150 మాత్రమే విక్రయిస్తున్నట్లు టీ-సిరీస్ ప్రకటించింది. 3D టికెట్ల రేట్ల తగ్గింపునకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే అని వెల్లడించింది. ఈ ఆఫర్ ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండదని తెలిపింది. 3D గ్లాస్ అద్దాలకు అదనపు ధర చెల్లించాలని పేర్కొంది. 

Also Read: Hyderabad Rains: రుతుపవనాలొచ్చేశాయి, వర్షాలతో పులకరించిన హైదరాబాద్, సేద తీరిన జనం

ఇదేక్కడి దిక్కుమాలిన ఆఫర్ అని అభిమానులు అంటున్నారు. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో కాస్తో కూస్తో చూసేది సౌత్ ప్రజలేనని.. ఇక్కడే ఆఫర్ లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మీరు టికెట్ల రేట్ల తగ్గించి.. పాప్ కార్న్ ఫ్రీగా ఇచ్చినా ఎవరూ థియేటర్‌కు రారని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో హనుమంతుడి చెప్పిన డైలాగ్స్ హిందూవుల మనోభావాల్ని గాయపరుస్తున్నాయనేది  విమర్శలు రావడంతో కొన్ని మార్పులు చేశారు. మూవీలో డైలాగ్స్ మార్చినా పెద్దగా మార్పు కనిపించడం లేదని ప్రేక్షకులు అంటున్నారు. టికెట్లు రేట్లు తగ్గించి.. డైలాగ్స్ మార్చడంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

Also Read: AP Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News