పీచు మిఠాయితో డ్రెస్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బాలీవుడ్ భామ వీడియో ?

Urfi Javed Cotton Candy Dress: హిందీ నటి ఉర్ఫీ జావెద్ 'పీచు మిఠాయి' డ్రెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉర్ఫీ డ్రెస్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 04:56 PM IST
  • ఉర్ఫీ జావెద్ కొత్త ఫ్యాషన్
  • పీచు మిఠాయినే డ్రెస్‌గా ధరించిన ఉర్ఫీ
  • ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసిన ఉర్ఫీ
పీచు మిఠాయితో డ్రెస్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బాలీవుడ్ భామ వీడియో ?

Urfi Javed Cotton Candy Dress: ఎక్స్‌పోజింగ్‌లో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావెద్.. ఈసారి సరికొత్త ఔట్‌ఫిట్స్‌ ట్రై చేసింది. నిజానికి ఆమె ధరించింది డ్రెస్ కాదు. పీచు మిఠాయినే డ్రెస్‌లా మార్చేసింది. ఎరుపు రంగు పీచు మిఠాయిని టాప్‌గా, ఆకుపచ్చ రంగు పీచు మిఠాయిని స్కర్ట్‌గా ధరించింది. అదే పీచు మిఠాయిని తీసి కాస్త నోట్లో  కూడా వేసుకుంది. ఉర్ఫీ జావెద్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఉర్ఫీ డ్రెస్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'నీ ఐడియాలు ఆస్కార్ రేంజ్...' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... 'ఇలాంటివి నీకే సాధ్యం' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియోకి ఇప్పటివరకూ 63 వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి. 

ఉర్ఫీ కెరీర్ విషయానికొస్తే... టెలివిజన్‌లో ఆమె చాలానే షోలు చేసింది. 2016లో 'బడే భయ్యాకి దుల్హానియా' సీరియల్‌తో ఆమె తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత చంద్ర నందిని, మేరీ దుర్గా, జీజీ మా, దయాన్, ఆయే మేరే హమ్ సఫర్ తదితర సీరియల్స్‌లో నటించింది. గతేడాది పంచ్ బీట్ 2 అనే వెబ్ సిరీస్‌తో పాటు బిగ్‌బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, సింగర్ కున్వర్‌తో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో మెరిసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urrfii (@urf7i)

Also Read: Acharya Pre-Release: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్​- ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్​..

Prabhas Fined: రెబల్ స్టార్ ప్రభాస్‌కు షాకిచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్... జరిమానా విధింపు... 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News