Samantha: కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయని సమంత.. కారణం ఇదేనా?

Samantha: సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సామ్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న మూవీస్ పూర్తయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటుందట. కారణం ఏంటంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2023, 10:24 AM IST
Samantha: కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయని సమంత.. కారణం ఇదేనా?

Samantha Updates:  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారా.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. చైతూతో విడాకుల అనంతరం ఆమె ఆనారోగ్యం పాలయ్యారు. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో అన్ని సమస్యలను అధిగమించింది. మయోసైటిస్ నుండి కోలుకున్న తర్వాత  ఆమె తిరిగి సినిమాలతో  బిజీ అయింది. సామ్ నటించిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆమె తన తర్వాత ప్రాజెక్టులపై ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమా చివరి షెడ్యూల్ నడుస్తోంది. ఈ వారంలో షూటింగ్ మెుత్తం పూర్తవుతుందని విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఆమె పూర్తి చేయడానికి వెబ్ సిరీస్ "సిటాడెల్" మాత్రమే ఉంది. 

ప్రస్తుతం సామ్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మూవీస్ కు కొంత కాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా ఆమె తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది. అందుకే సుదీర్ఘ విరామం తీసుకోవాలనుకుంటుంది. ఇక వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనుందట. అయితే ఈలోపు ఖుషి'ప్రమోషన్స్‌లో మాత్రం సమంత కనిపిస్తుందట. ఈ విషయం తెలిసి సామ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు సమంత ప్రేమలో పడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైవర్స్ తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

Also read: Ravi Teja Multi Starrer: రవితేజ, విశ్వక్‌సేన్ మల్టీస్టారర్.. విలన్‌గా మంచు మనోజ్​? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News