టాలీవుడ్ బ్యాచిలర్లలో ఒకరైన హీరో నితిన్ త్వరలో నితిన్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఆయన షాలిని అనే అమ్మాయిని ప్రేమించారు. ఆయన ప్రేమ సక్సెస్ అయింది. ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో వీరి నిశ్చితార్థ వేడుక కొందరు సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి పనులు మొదలయ్యాయని నితిన్ ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏప్రిల్ 16 దుబాయ్ వేదికగా నితిన్, షాలినిలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాదులో తన సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీ వారికి గ్రాండ్ రిసిప్షన్ ప్లాన్ చేసినట్లు సమచారం. నితిన్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు ట్వీట్ చేయగా.. హీరోయిన్ రష్మిక మందన్న సరదాగా స్పందించింది. ఈ మేరకు రష్మిక చేసిన ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హీరో నితిన్ పెళ్లి ఎప్పుడంటే... !!
Congratulations @actor_nithiin saaaaaaaaar.!!😁😁💃🏻 See I am lucky for you. You are getting off married and all.😂 Just kidding. I am super happy happy for you two.!♥️ https://t.co/k8P3ZyF65p
— Rashmika Mandanna (@iamRashmika) February 15, 2020
‘కంగ్రాట్స్ నితిన్ సార్!! నేనొచ్చిన వేళా విశేషం మీరు పెళ్లిచేసుకోబోతున్నారు. నేను మీకు చాలా లక్కీ. జస్ట్ కిడ్డింగ్. మీ ఇద్దరిని ఇలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందని’ రష్మిక ట్వీట్ చేసింది. కాగా, నితిన్, రష్మిక కలిసి నటించిన లేటెస్ట్ సినిమా ‘భీష్మ’ మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ నెల 17న ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!