Poorna:మొన్నే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా.. పెళ్లి విషయంలో పూర్ణ సంచలన నిర్ణయం?

Actress Poorna Marriage Cancelled: ఆసిఫ్ అలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా పూర్ణ ప్రకటించింది. అయితే ఇప్పుడు పూర్ణ తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 10:21 AM IST
Poorna:మొన్నే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా.. పెళ్లి విషయంలో పూర్ణ సంచలన నిర్ణయం?

Actress Poorna Marriage Cancelled: తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన మలయాళ భామ షమ్నా కాశిం తన పేరుని పూర్ణగా మార్చుకుంది. తెలుగులో కొన్ని సినిమాలు ద్వారా పేరు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై మెరవడానికి ప్రయత్నిస్తోంది. ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలలో బిజీ అవుతున్న ఆమె పెళ్లికి సిద్ధమైనట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసిఫ్ అలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా ఆమె ప్రకటించింది.

 అంతేకాక వారిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా తెగ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతున్నట్లు ప్రచారం మొదలైంది. పూర్ణ తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ ఏడాది చివర్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నా సరే ఇప్పుడు వివాహం రద్దు చేసుకున్నారని అంటున్నారు.

అయితే ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు గానీ పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో మాత్రం తమ ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేయకపోవడంతో ఈ ప్రచారం నిజం కాదేమో అని కూడా మరో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద పూర్ణ స్వయంగా ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారం ఆగే అవకాశం కనిపించడం లేదు. గతంలో చాలా మంది హీరోయిన్లు ఇలా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి పీటల వరకు వెళ్లిన తర్వాత కూడా అవి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి.

మరి పూర్ణ జీవితంలో పెళ్లి అతనితోనే రాసి ఉందా లేక అది రద్దయిందా అనే విషయం మీద మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్ణ తెలుగులో సీమటపాకాయ్, అవును, అఖండ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలలో కనిపించింది. అయితే ఆమె అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదని చెప్పాలి.
Also Read: Mehaboob Dilse: మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం.. ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ గా!

Also Read:  Karthikeya 2 Trailer 2: శ్రీకృష్ణుడే ఎంచుకున్న వైద్యుడితడు.. అమాంతం అంచనాలు పెంచేసిన రెండో ట్రైలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News