Keerthy Suresh: మహేశ్ బాబును 3 సార్లు కొట్టాను... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Keerthy Suresh: సర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్ ల్లో భాగంగా...సూపర్ స్టార్ మహేశ్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి కీర్తి సురేష్.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 05:32 PM IST
Keerthy Suresh: మహేశ్ బాబును 3 సార్లు కొట్టాను... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu- Keerthy Suresh: సూపర్ స్టార మహేశ్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. గీత గోవిందం పేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ కు (Sarkaru Vaari Paata Trailer) ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోనే 24 మిలియన్స్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

రిలీజ్ డేట్ దగ్గర పడతుండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)..మహేశ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మర్చిపోయి...రెండు సార్లు మిస్ టైమింగ్ తో మహేష్ ను కొట్టినట్లు ఈ అమ్మడు చెప్పింది. ఆ తర్వాత దానికి సారీ చెప్పానని.. అయితే మూడోసారి కూడా పొరపాటున కొట్టినట్లు చెప్పింది. దీని తర్వాత నాపై కోపం ఏమైనా ఉందా? అని మహేశ్ సరదాగా అడిగారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేశ్ ఇతర సినిమాలకొస్తే... త్వరలో త్రివిక్రమ్, రాజమౌళిలతో సినిమాలు చేయనున్నారు. 

Also Read: SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్‌.. అర్ధ గంటలోనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News