Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచులు దంపతులకు మగబిడ్డ పుట్టినట్టు సమాచారం, విషయం తెలిసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 06:23 PM IST
Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్

Actress Kajal Agarwal Gautam Kitchlu couples Blessed with Baby Boy: టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి అన్న విషయం మన అందరికీ తెలిసిందే.. ప్రెగ్నన్సీ తరువాత కాజల్ సినిమాలకి దూరంగా ఉంటూ.. దంపతులు ప్రెగ్నన్సీ ప్లాన్ చేసుకున్నారు. తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే.. కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.. 

సినీ నటి కాజల్ అగర్వాల్ తల్లిగా ప్రమోటయింది. కాజల్, గౌతమ్ కిచ్లూ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ ఏడాది నూతన సంవత్సరం రోజే కాజల్ భర్త గౌతమ్ ఆమె ప్రెగ్నెన్సీ న్యూస్ కన్ఫమ్ చేశారు. అప్పట్నుంచి అడపాదడపా కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. కాజల్ బంప్ పిక్స్‌కు చాలా మంది లైక్ కొట్టారు.  ఆమె చేసిన యోగా మొదలు చివరికి ఆమె కోరిక నెరవేరిన రోజు వరకూ చాలా ఫోటోలే విడుదల చేసింది కాజల్.

కొద్ది రోజుల క్రితం, కాజల్ గర్భిణీగా తీసుకున్న అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో నలుపు రంగు గౌను ధరించి తన గర్భంలోని శిశువుతో జోల పాడుతూ ఆడుకున్నట్లుగా కనిపించింది. అందులో లైట్‌గా మేకప్‌ ధరించి ఎంతో ఆకట్టుకునేలా దర్శనమిచ్చింది కాజల్.  ఆ పిక్‌ పక్కనే "యాంటిషిపేషన్‌(ఊహించండి)" అని రాసింది.

బాలీవుడ్ నుంచి అందుతున్న తాజా అప్‌డేట్స్‌ ప్రకారం.. కాజల్‌, గౌతమ్ దంపతులు తల్లిదండ్రులయ్యారని, చందమామ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. ఈ  క్యూట్ కపుల్ తమ సంతోషాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. 

గతంలో ఓ మేగజిన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలోనూ కాజల్ తన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు, తన భర్త గౌతమ్‌కు ఇది మొదటిసారి కాబట్టి ఎంతో సంతోషంగా ఉందని, అయితే దాంతోపాటు అంతే ఆందోళనగానూ ఉందని పేర్కొంది. ఒకరికి జన్మనిచ్చి పోషించి పెద్ద చేయటమనేది ఎంతో అద్భుతమైనదని, సరైన విలువలతో పెంచటం అంతే బాధ్యతతో కూడుకున్నదని కాజల్ చెప్పుకొచ్చింది. అయితే తొలిసారి తల్లి కాబోతున్నందుకు అంతే దృఢంగా ఉన్నానని చెప్పింది.

తన ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయాక.. మూడు నెలలపాటు అలవాట్లన్నీ మార్చుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టినంత పనైందని, అందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని పేర్కొంది. తల్లి కావాలంటే ఒక మహిళ శరీరం ఎన్నో మార్పులకు, వ్యయప్రయాసలకు ఓర్వాల్సి ఉంటుందని, తొలి మూడు నెలలు ఎంతో వ్యాయమం, యోగ, అహారపు అలవాట్ల మార్పు వంటివి పాటించి తాను ఒత్తిడిని అధిగమించానని కాజల్ పేర్కొంది.

గత ఫిబ్రవరి 24న తన శ్రీమంతం సందర్భంగా తీసిన ఫోటోల్లో అందంగా దర్శనమిచ్చింది. తను తల్లిగా ఎలా ఉండాలో శిక్షణ తీసుకున్నానని, తనలో దాగిఉన్న నిగూఢ శక్తిని గర్భం దాల్చాక తెలుసుకోగలిగానని పేర్కొంది. అనవసర భయాలూ ఆవహించిన సందర్భాలూ ఉన్నాయంది కాజల్. మొత్తంమీద కాజల్, గౌతమ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవటంపై అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Also read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!

Also read: Honey And Garlic Benefits: తేనె-వెల్లుల్లి కలిపి తీసుకోండి.. ఈ వ్యాధులకు చెక్ పెట్టండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News