Anushka Sharma: విరాట్ కోహ్లీకి నచ్చని విషయం అదే

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) తన భర్తకు, తనకు మధ్య దృఢమైన బంధానికి గల కారణాలను, ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఇతర ఆసక్తికరమైన ఘటనలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Last Updated : Aug 6, 2020, 09:37 PM IST
Anushka Sharma: విరాట్ కోహ్లీకి నచ్చని విషయం అదే

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) తన భర్తకు, తనకు మధ్య దృఢమైన బంధానికి గల కారణాలను, ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఇతర ఆసక్తికరమైన ఘటనలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్న అనుష్క.. అనేక సరదా సంగతులను, విలువైన సలహాలను వారితో పంచుకుంది. విరాట్‌ కోహ్లీని ( Virat Kohli ) చికాకు పెట్టడానికి మీరు ఏం చేస్తారు అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు అనుష్క స్పందిస్తూ... “నేను అతన్ని ఏదైనా బోర్డు గేమ్స్‌లో ఓడించి సరదాగా ఏడిపించినప్పుడు విరాట్ చాలా ఇరిటెట్ అవుతాడని చెప్పుకొచ్చింది". ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఓడిపొవడం అంటే అస్సలు ఇష్టం ఉండదని అనుష్క చెప్పుకొచ్చింది. Also read: నితిన్ సినిమాను పూజా హెగ్డే అందుకే రిజెక్ట్ చేసిందా ?

వైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే ఇరువురు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలను  ( Happy marriage life secrets ) కూడా అనుష్క శర్మ తన అభిమానులతో పంచుకుంది. " ఒకరిపై మరొకరికి విశ్వాసం, ప్రేమ ఉండాలి. జీవితంలో హెచ్చు తగ్గులు ఎదురైనప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండి మద్దతివ్వాలి. అప్పుడే వారు ఆ కష్టాలను, ఇబ్బందులను అధిగమించేందుకు వీలు ఉంటుంది. లేదంటే ఆ బంధం ఇబ్బందుల్లో పడుతుంది అంటూ సైకాలజీ పాఠాలు చెప్పుకొచ్చింది అనుష్క. Also read: Virat Kohli: అనుష్క దొరకడం నా అదృష్టం

2017లో ఇటలీలో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విరుష్క జంట.. పెళ్లి తర్వాత కూడా ఆ లవ్ జర్నీని కొనసాగిస్తూ కొత్త జంటలకు స్పూర్తిగా నిలుస్తోంది. Also read: COVID-19: 24 గంటల్లో 72 మంది మృతి

Trending News