Aamani's health condition: హీరోయిన్ ఆమనికి నిజంగానే అనారోగ్యమా ?

Aamani's health condition news: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో ఒకరైన ఆమని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనేది ఆ వార్తల సారాంశం.

Last Updated : Feb 3, 2021, 11:13 AM IST
  • Aamani కి అస్వస్థత అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్.
  • ఆమని పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం.
  • తనకు అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన Actress Aamani.
Aamani's health condition: హీరోయిన్ ఆమనికి నిజంగానే అనారోగ్యమా ?

Aamani's health condition news: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో ఒకరైన ఆమని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనేది ఆ వార్తల సారాంశం. కానీ ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా ఆమనినే స్పష్టంచేసింది. ఒక సినిమా షూటింగ్ కోసం మంచిర్యాల వెళ్లినప్పుడు అక్కడ Food poison అయిందని.. అంతకు మించి తనకు మరే ఇతర ఆరోగ్య సమస్యలు ( Health issues ) లేవని ఆమని తేల్చిచెప్పింది. 

Also read : Adipurush shooting: ఆదిపురుష్ షూటింగ్‌లో Fire accident

షూటింగ్ కోసం మంచిర్యాలకు వెళ్లినవాళ్లందరం Food poisoning బారినపడ్డామని... అందరం కూడా తిరిగి కోలుకుంటున్నాం అని ఆమని చెప్పుకొచ్చింది. అసలు విషయం తెలియకుండా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపచేస్తున్నారని ఈ సందర్భంగా ఆమని మండిపడింది. అప్పట్లో హీరోయిన్‌గా చేసిన ఆమని ( Actress Aamani ) .. సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరో, హీరోయిన్స్‌కి తల్లి పాత్రలు చేస్తూ బిజీ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News