Actor Thiruveer : ఐదారు టేక్స్ తీసుకున్నా.. సినిమా ఆఫర్ రాదనుకున్నా.. మసూదపై తిరువీర్ కామెంట్స్

Actor Thiruveer About Masooda మసూద సినిమా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ మూవీతో తిరువీర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే తిరువీర్ తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 01:31 PM IST
  • బాక్సాఫీస్ వద్ద మసూద సందడి
  • తిరువీర్‌ పాత్రకు మంచి రెస్పాన్స్
  • మసూద జర్నీపై తిరువీర్ కామెంట్స్
Actor Thiruveer : ఐదారు టేక్స్ తీసుకున్నా.. సినిమా ఆఫర్ రాదనుకున్నా.. మసూదపై తిరువీర్ కామెంట్స్

Actor Thiruveer - Masooda : జార్జిరెడ్డి, పలాస చిత్రాలను చూస్తే తిరువీర్ స్టామినా ఏంటో తెలుస్తుంది. నెగెటివ్ రోల్‌కు పర్ఫెక్ట్ చాయిస్‌గా అనిపించిన తిరువీర్.. ఇప్పుడు మసూద సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది వరకు చేసిన పాత్రల కంటే మసూదలో చేసిన కారెక్టర్ ఎంతో భిన్నంగా ఉంటుంది. తిరువీర్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా వేసిన ఈ గోపీ పాత్ర ఇప్పుడు అందరికీ కనెక్ట్ అయింది. నిజంగానే పక్కింటి కుర్రాడిలానే కనిపించాడు. మసూద వచ్చి రెండు వారాలు అయినా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడేస్తోంది.

ఈ క్రమంలో తిరువీర్ మీడియాతో ముచ్చటించాడు. తన గురించి, తన జర్నీ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. తన అసలు పేరు తిరుపతి రెడ్డి అని, కానీ తిరువీర్‌గా మార్చుకున్నట్టుగా తెలిపాడు. నాటకాల్లో రఘువీర్ అనే వ్యక్తిని గురువుగా భావించానని, అందుకే వీర్ అని తగిలించుకున్నట్టు తెలిపాడు. అయితే ఓ సారి ఇంట్లో తన పేరు తిరువీర్‌ అని మార్చుకున్నట్టు తెలియడంతో తన అమ్మ ఎంతగానో సంతోషించిందట. తన అమ్మ పేరు వీరమ్మ అని.. తన తల్లి పేరు కూడా అలా కలిసి వచ్చిందని.. అలా అమ్మా, గురువు పేరు కలవడంతో సెంటిమెంట్‌గా మారిందని తన తిరువీర్ పేరు వెనుకున్న అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఇక మసూద విషయానికి వస్తే.. ముందుగా కెమెరామెన్ జగదీష్‌ చీకటి ఈ ఆఫర్ గురించి చెప్పాడట. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఆఫర్ వస్తుందని తెలియడంతోనే షాక్ అయ్యానని, పాత్ర, కథ ఎలా ఉన్నా కూడా చేసేయాలని అనుకున్నాడట. ఓ సారి డైరెక్టర్‌ను కలవడం, ఆయన అన్న మాటలకు ఫిదా అయిపోయాడట. కలిసినంత మాత్రాన చాన్స్ ఇస్తానని కాదు.. కథకు సెట్ అయితే, నిర్మాతకు నచ్చితేనే చాన్స్ ఇస్తానని దర్శకుడు అన్నాడట.

తన ఫ్రెండ్‌తో గొడవ పడే సీన్, ఇంగ్లీష్ డైలాగ్ చెప్పే సీన్‌ను ఆడిషన్‌గా చేశారట. కానీ తనకు అంతగా ఇంగ్లీష్ రాకపోవడంతో.. ఐదారు టేక్స్ తీసుకున్నాడట. ఇన్ని టేక్స్ తీసుకున్న తరువాత సినిమా ఆఫర్ ఏం వస్తుంది.. ఇక రాదేమో అని అనుకున్నాడట. కానీ చివరకు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, దర్శకుడికి నచ్చడంతో మసూద అవకాశం వచ్చిందంటూ తన జర్నీ గురించి తిరువీర్ చెప్పుకొచ్చాడు.

గోపీ పాత్ర తనకు మంచి పేరు తీసుకొచ్చిందని, జనాలు గుర్తు పడుతున్నారని, గోపీ అంటూ సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెడుతున్నారని తిరువీర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కొత్తగా ఏ సినిమాలు కూడా ఒప్పుకోలేదని, రెమ్యూనరేషన్ కోసం కాకుండా కథలు నచ్చితేనే సినిమాలు చేద్దామని అనుకుంటున్నట్టుగా తెలిపాడు.
 

Also Read : Anchor Ravi Wife : 18 ఏళ్ల పరిచయం.. పదేళ్ల వివాహా బంధం.. యాంకర్ రవి ఎమోషనల్ పోస్ట్

Also Read : Shruti Haasan without Makeup : మేకప్ లేకపోతో ఇలా ఉంటుందా?.. శ్రుతి హాసన్‌ అలా అయిపోవడానికి కారణాలివేనట

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News