Sunil as Hero: మళ్లీ హీరోగా కనిపించనున్న సునిల్ ?

Sunil as a Hero Again: సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఏ క్రాఫ్ట్ లోకి వెళ్లిపోతారో ఊహించడం తెలియదు. ఉదాహరణకు విలన్ అవ్వాలి అని అనుకున్న సునిల్ ( Sunil ) హాస్యనటుడిగా మంచి విజయం సాధించాడు. 

Last Updated : Nov 9, 2020, 07:29 PM IST
    1. సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఏ క్రాఫ్ట్ లోకి వెళ్లిపోతారో ఊహించడం తెలియదు.
    2. ఉదాహరణకు విలన్ అవ్వాలి అని అనుకున్న సునిల్ హాస్యనటుడిగా మంచి విజయం సాధించాడు.
    3. తరువాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్నలో హీరోగా కనిపించాడు.
    4. అందాల రాముడు, మిస్టర్ పెళ్లికొడుకు వంటి సినిమాల్లో హీరోగా రాణించాడు.
Sunil as Hero: మళ్లీ హీరోగా కనిపించనున్న సునిల్ ?

Sunil in A Kannada Film Remake | సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఏ క్రాఫ్ట్ లోకి వెళ్లిపోతారో ఊహించడం తెలియదు. ఉదాహరణకు విలన్ అవ్వాలి అని అనుకున్న సునిల్ ( Sunil ) హాస్యనటుడిగా మంచి విజయం సాధించాడు. తరువాత రాజమౌళి ( SS Rajamouli ) తెరకెక్కించిన మర్యాద రామన్నలో హీరోగా కనిపించాడు. అందాల రాముడు, మిస్టర్ పెళ్లికొడుకు వంటి సినిమాల్లో హీరోగా రాణించాడు.అవకాశాలు తగ్గడంతో ఈ మధ్య మళ్లీ మంచి పాత్రలు వస్తే చేయడం ప్రారంభించాడు.

Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!

తాజాగా కలర్ ఫోటో మూవీలో ( Colour Photo Movie) విలన్ పాత్రలో కనిపించిన సునిల్ మరోసారి కెరీయర్ ను స్విచ్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోసారి హీరోగా నటించనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక డైరక్ట్ చిత్రం కాదు అని ఒక రీమేక్ చిత్రం అని తెలుస్తోంది. కన్నడలో విజయం సాధించిన బెల్ బాటమ్ ( Bell Bottom) మూవీ తెలుగు వర్షన్ లో సునీల్ నటించనున్నాడట.

Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం

2019లో కన్నడలో విడుదలైన బెల్ బాటమ్ మూవీ మంచి కామెడీ చిత్రంగా అక్కడి ప్రేక్షకులకు మంచి వినోదం అందించగలిగింది. మూవీ సూపర్ హిట్ అయింది. తరువాత ఈ మూవీ తెలుగు రైట్స్ ను రక్షిత్ శెట్టి సొంతం చేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో సునిల్ లీడ్ రోల్ చేయనున్నాడట.

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలో మరిన్ని వివరాలు కొన్ని రోజుల తరువాత తెలిసే అవకాశం ఉంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News