Sumanth Ashwin Wedding: సుమంత్ అశ్విన్ పెళ్లికి డేట్ ఫిక్స్

Sumanth Ashwin to tie knot with Deepika: సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత, ఎంఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు తనయుడు అయిన సుమంత్ అశ్విన్.. దీపిక అనే అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2021, 12:49 AM IST
Sumanth Ashwin Wedding: సుమంత్ అశ్విన్ పెళ్లికి డేట్ ఫిక్స్

Sumanth Ashwin to tie knot with Deepika: సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత, ఎంఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు తనయుడు అయిన సుమంత్ అశ్విన్.. దీపిక అనే అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 13న సుమంత్ అశ్విన్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్‌లోనే అతి కొద్ది మంది సమీప బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రుల మధ్య సుమంత్ అశ్విన్ పెళ్లి ( Sumanth Ashwin marriage ) జరగనున్నట్టు తెలుస్తోంది.

ఎం.ఎస్ రాజుకు ఒక నిర్మాతగా సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు, నటీనటులు, టెక్నీషియన్స్‌తో పరిచయాలు ఉన్నప్పటికీ... కొవిడ్-19 గైడ్ లైన్స్ కారణంగా అతి కొద్ది మంది మధ్యే ఈ పెళ్లిని జరిపించాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఒక్కడు, శత్రువు, వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా వంటి చిత్రాలతో ఎం.ఎస్ రాజు దశాబ్ధం, రెండు దశాబ్ధాల క్రితమే నిర్మాతగా తన సత్తా చాటుకున్నాడు. 

Also read : Adipurush shooting: ఆదిపురుష్ షూటింగ్‌లో Fire accident

అయితే, సుమంత్ అశ్విన్‌కి మాత్రం ఇంకా సరైన హిట్ తగల్లేదు. తూనీగ.. తూనీగ.., కేరింత వంటి చిత్రాలతో పాపులర్ అయిన సుమంత్ అశ్విన్ ఇప్పటివరకు దాదాపు డజెన్ చిత్రాల్లో నటించాడు. Sumanth Ashwin తన కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు. Sumanth Ashwin wedding అయినా అతడి ఫేట్ మారుస్తుందేమో చూద్దాం అంటున్నారు సినీ ఫోక్స్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News