Actor Naresh Marriage: నరేష్-పవిత్రల పెళ్లి వీడియో.. పవిత్ర బంధం అంటూ నటుడి ట్వీట్.. అసలు విషయం ఇదా!

Naresh Married Pavitra Lokesh:  పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నట్టుగా నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు, దీంతో ఈ విషయం మీద మరింత చర్చ జరుగుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 10, 2023, 11:45 AM IST
Actor Naresh Marriage: నరేష్-పవిత్రల పెళ్లి వీడియో.. పవిత్ర బంధం అంటూ నటుడి ట్వీట్.. అసలు విషయం ఇదా!

Actor Naresh Married Pavitra Lokesh: గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నట్టుగా నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. ఒక పవిత్ర బంధం రెండు మనసులు, మూడు ముడులు, ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ ఆయన రాసుకొచ్చారు. అయితే తెలుగులో రాసిన పదాల్లో బూతులు దొరలడంతో వెంటనే డిలీట్ చేశారు ట్వీట్ తో పాటు ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

వీడియోలో నరేష్ ఏడు అడుగులు వేస్తున్నట్లు పవిత్ర మెడలో దండలు వేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. అయితే వారంతా సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు అనే ప్రచారం జరుగుతోంది. ఒకపక్క నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో లీగల్గా ఇంకా విడాకులు జరగకపోవడంతో ఇదంతా ఏదైనా సినిమానో లేక వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ స్టంట్ అయి ఉంటుందని ప్రచారం కూడా జరుగుతోంది.

వాస్తవానికి పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరి గురించి ఎలాంటి వార్త వస్తున్నా మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రేజ్ ని వాడుకునేందుకు వీరిద్దరూ సిద్ధమై ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా గతంలోనే ప్రచారం జరిగింది. సరిగ్గా డిసెంబర్ 31వ తేదీన తాము కొత్త అడుగులు వేస్తున్నామని చెబుతూ పవిత్ర, నరేష్ లిప్ లాక్ ఇస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంలో పెద్ద రచ్చ రేగింది.

అప్పుడు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి రంగంలోకి దిగి తనకు తన భర్తకు ఇంకా విడాకులు అవలేదని కోర్టులో ఉండగానే ఆయన మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతాడు అని తాను  అనుకోవడం లేదని తనను రెచ్చగొట్టడానికో లేక ఏదైనా సినిమా ప్రమోషనల్ స్టంట్ అయి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. బహుశా ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read: Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?

Also Read: Garikapati Comments: రామ్ చరణ్ పై గరికపాటి కామెంట్స్.. వారికి నమస్కారం అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 
 
 

Trending News