Shyam Singha Roy: ఇద్దరు హీరోయిన్లతో నాని రొమాన్స్..

Actor Nani in Shyam Singha Roy Movie | నేచరుల్ స్టార్ నాని, నటి సాయిపల్లవి మరోసారి వెండితెరపై తమ కెమిస్ట్రీని పండించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేచురల్ యాక్టింగ్‌తో సూపర్బ్ అనిపించుకునే నటీనటులు మరోసారి జోడీగా కనిపిస్తే ఎలా ఉంటుంది.

Last Updated : Oct 27, 2020, 09:02 AM IST
  • నేచురల్ యాక్టింగ్‌తో సూపర్బ్ అనిపించుకునే నటీనటులు
  • నేచరుల్ స్టార్ నాని, నటి సాయిపల్లవి మరోసారి వెండితెరపై
  • ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి మరో హీరోయిన్‌గా నటించనుంది
Shyam Singha Roy: ఇద్దరు హీరోయిన్లతో నాని రొమాన్స్..

నేచురల్ యాక్టింగ్‌తో సూపర్బ్ అనిపించుకునే నటీనటులు మరోసారి జోడీగా కనిపిస్తే ఎలా ఉంటుంది. నేచరుల్ స్టార్ నాని (Actor Nani), నటి సాయిపల్లవి మరోసారి వెండితెరపై తమ కెమిస్ట్రీని పండించేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో ‘ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి’ మూవీతో నటించి మెప్పించారు నాని, సాయిపల్లవి (Sai Pallavi) ఈ జోడీ మరోసారి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంది. విషయానికొస్తే... నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’శ్యామ్ ‌సింగ రాయ్’ (Shyam Singha Roy Movie). రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

 

సాయిపల్లవితో పాటు టీనేజ్ బ్యూటీ, ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty) మరో హీరోయిన్‌గా నటించనుంది. భారీ బడ్జెట్‌తో శ్యామ్ ‌సింగ రాయ్ మూవీ తెరకెక్కుతోందనియూనిట్ చెబుతోంది. మూవీ రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీలో నాని డిఫరెంట్ లుక్‌తో అలరించనున్నాడు. విభిన్నమైన కథ, కథనాలు సినిమాకు ప్లస్ పాయింట్ అవుతాయని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. కరోనా లేకపోతే షూటింగ్ సైతం సగం వరకు పూర్తయ్యేది.

 

నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతాన్ని అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. క్రేజీ జోడి మూవీ అనగానే హైప్ వచ్చింది, ఉప్పెన హీరోయిన్ కూడా ప్రాజెక్టులో చేరడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News