Praveen Kumar Sobti: 'మహాభారత్‌’లో భీముడి పాత్రధారి కన్నుమూత

Praveen Kumar Sobti: 1988లో వచ్చిన ప్రముఖ టీవీ సీరియల్ ‘'మహాభారత్‌’'లో భీముడిగా నటించి మెప్పించిన నటుడు, అథ్లెట్ ప్రవీణ్‌ కుమార్ సోబ్తీ కన్నుమూశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 02:37 PM IST
  • 'మహాభారత్' భీముడు ఇక లేరు
  • నిన్న రాత్రి గుండెపోటుతో ప్రవీణ్‌ కుమార్ మృతి
  • విచారం వ్యక్తం చేసిన బీఎస్ఎఫ్
Praveen Kumar Sobti: 'మహాభారత్‌’లో భీముడి పాత్రధారి కన్నుమూత

Praveen Kumar Sobti: బీఆర్ చోప్రా దర్శకత్వం వహించిన ప్రముఖ సీరియల్ 'మహాభారత్' (Mahabharat). ఇందులో భీముడిగా నటించి మెప్పించిన ప్రవీణ్‌ కుమార్ సోబ్తీ (Praveen Kumar Sobti) కన్నుమూశారు. సోమవారం రాత్రి దిల్లీ అశోక్‌విహార్‌లోని తన నివాసంలో గుండెపోటుతో (Heart Attack) తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి సోబ్తీకు గుండెపోటుకు గురవ్వడంతో..కుటుంబసభ్యులు వైద్యులను పిలిచారు. రాత్రి 10-10.30 గంటల ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

ప్రవీణ్ కుమార్ సోబ్తి 20 సంవత్సరాల వయస్సులో బీఎస్ఎఫ్ (BSF)లో చేరారు. సోబ్తి అథ్లెటిక్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హామర్, డిస్క్ త్రో క్రీడలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఏషియన్‌ గేమ్స్‌లో (Asian Games) 1966, 1970ల్లో రెండు బంగారు పతకాలతోసహా నాలుగు పతకాలు గెలుచుకున్నారు. 1966లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో హ్యామర్‌ త్రోలో రజత పతకం సాధించారు.

ప్రవీణ్ కుమార్ సోబ్తి నటించిన మెుదటి సినిమా 'రక్ష'. ఆయన ఈ సినిమాలో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటించారు. ఆ తర్వాత 1988 నుండి 1990 వరకు నడిచిన దిగ్గజ టీవీ సీరియల్ ‘'మహాభారత్‌'’లో భీముడిగా నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని  చూరగొన్నారు.  అజూబా, ఆజ్ కా అర్జున్, ఘయల్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. 1990ల్లో వచ్చిన ‘'కిష్కిందకాండ'’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ప్రవీణ్ కుమార్ సోబ్తీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో (Aam Aadmi Party) చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయిన మరుసటి ఏడాది బీజేపీలో (BJP) చేరారు. మిస్టర్ సోబ్తీకి భార్య, కుమార్తె ఉన్నారు. మిస్టర్ సోబ్తి మృతికి  బీఎస్ఎఫ్ తన అధికార ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది.  

Also Read: Lata Mangeshkar Wealth: రూ.370 కోట్ల విలువైన లతా మంగేష్కర్ ఆస్తికి వారసుడు ఎవరు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News