Ajay Devgan brother Anil Devgan dies: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులను కూడా పొట్టన బెట్టుకుంటోంది. తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) సోదరుడు కరోనా బారిన పడి కన్నుమూశారు. అజయ్ దేవగన్ కజిన్ బ్రదర్ అనిల్ దేవగన్ (51) (Anil Devgan) కరోనాతో మంగళవారం మృతిచెందారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అనిల్ దేవగన్ చనిపోతాడని ఊహించలేదని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. తాను, తన కుటుంబం, చిత్ర నిర్మాణ సంస్థ ఏడీఎఫ్ఎఫ్ అనిల్‌ను చాలా మిస్సవుతున్నట్లు పేర్కొన్నారు. అనిల్ దేవగన్ ఆకస్మిక మరణం తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. అజయ్ దేవగన్ ట్వీట్ చేశారు.
I lost my brother Anil Devgan last night. His untimely demise has left our family heartbroken. ADFF & I will miss his presence dearly. Pray for his soul. Due to the pandemic, we will not have a personal prayer meet🙏 pic.twitter.com/9tti0GX25S
— Ajay Devgn (@ajaydevgn) October 6, 2020
ఇదిలాఉంటే.. అనిల్ దేవగన్ 2000లో తీసిన రాజు చాచా సినిమా ఆయనకు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన 2005లో బ్లాక్‌మెయిల్, 2008లో హాల్ ఎ దిల్ చిత్రాలకు దర్శక నిర్మాతగా వ్యవహరించారు. దీంతోపాటు అజయ్ దేవ్‌గన్, సోనాక్షి సిన్హా నటించిన సన్ ఆఫ్ సర్దార్ (2012) సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. Also read; River water disputes : ఏపీలోని ప్రాజెక్టులు ఆపకుంటే.. తెలంగాణలో బాబ్లీ తరహా ప్రాజెక్ట్: సీఎం కేసీఆర్
ఇదిలాఉంటే.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా.. చనిపోయిన అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్‌కు పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. అనిల్ దేవగన్ మరణం పట్ట అభిషేక్ బచ్చన్, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా సంతాపం తెలియజేశారు. Also read : TSPSC: గ్రూప్ 4 ఫలితాలు విడుదల
Anil Devgan: అజయ్ దేవగన్ సోదరుడు కన్నుమూత