Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!

Acharya Pre Release Event. ఆచార్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సందర్బంగా సుమ కనకాల అభిమానుల తరఫున చిరంజీవి, రామ్‌ చ‌ర‌ణ్, కొర‌టాల శివలను ప్రశ్నలను అడిగి అలరించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 06:50 PM IST
  • చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా
  • తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్
  • ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు ఆచార్య
Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!

Acharya Pre Release Event, Ram Charan more afraid of Upasana than Chiranjeevi: టాలీవుడ్ మెస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలలో 'ఆచార్య' ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తండ్రికొడుకుల కాంబోనే కాకుండా హిట్ దర్శకుడు పని చేసిన ఈ సినిమాపై ముందునుంచి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన పాటలు, టీజ‌ర్, ట్రైల‌ర్.. ఆచార్య సినిమాపై మరిన్ని అంచ‌నాల‌ను పెంచాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఆచార్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం (ఏప్రిల్‌ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్‌కు సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరించారు. సుమ ఉంటే ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. అభిమానుల తరఫున చిరంజీవి, రామ్‌ చ‌ర‌ణ్, కొర‌టాల శివలను ప్రశ్నలను అడిగి అలరించారు. ఇందులో కొన్ని ఫన్నీగా ఉన్నాయి. 

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌కు సుమ ఓ ప్రశ్న వేయగా.. చాలా తెలివిగా మెగా పవర్ స్టార్ బదులిచ్చాడు. ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనకా? అని అడగగా.. 'తెలియదు గానీ ఓ విషయం చెపుతా. అమ్మ ముందు నాన్న జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని.. ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే' అని చరణ్ చెప్పాడు. ఉపాసనకే బయపడుతానని చరణ్ చెప్పకనే చెప్పాడు. 

రామ్‌ చరణ్‌ సమాధానం విన్న మెగాస్టార్ చిరంజీవి.. అది నన్ను చూసి నేర్చుకున్నావ్‌. సుఖపడతావ్‌, సుఖపడతావ్‌. వాళ్లతో పెట్టుకోవద్దు' అని నవ్వుతూ అంటాడు. ఈ ప్రశ్న సమయంలో ఉపాసన తెగ నవ్వుకుంటారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తోంది. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ భార్యా ఉపాసన ముఖ్య అతిథిగా వచ్చారు. మణిశర్మ సంగీతం అందించిన ఆచార్య సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. 

Also Read: Yash New Look: ఎట్టకేలకు గడ్డం తీసేసిన యష్.. రాఖీ భాయ్ నయా లుక్ పోలా అదిరిపోలా!

Also Read: Pietersen on Kohli: విరాట్ కోహ్లీ చీకటి ప్రదేశంలో ఉన్నాడు.. ఇది మంచింది కాదు: పీటర్సన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News