Chiranjeevi Acharya: పవన్ కల్యాణ్ కోసం 'ఆచార్య' మూవీ స్పెషల్ స్క్రీనింగ్...

Acharya Special Screening: మెగా ఫ్యామిలీ కోసం ఆచార్య స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈ స్క్రీనింగ్‌కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 09:46 AM IST
  • మెగా ఫ్యామిలీ కోసం ఆచార్య స్పెషల్ స్క్రీనింగ్
  • స్పెషల్ షోకి హాజరుకానున్న పవన్ కల్యాణ్
  • స్వయంగా వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi Acharya: పవన్ కల్యాణ్ కోసం 'ఆచార్య' మూవీ స్పెషల్ స్క్రీనింగ్...

Acharya Special Screening: మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా విడుదలైనా ఆ ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేయడం పరిపాటి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవడంతో... మెగా ఫ్యామిలీ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. సాధారణంగా ఇలాంటి స్క్రీనింగ్స్‌కి దూరంగా ఉండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈసారి ఆచార్య స్పెషల్ స్క్రీనింగ్‌కి వస్తుండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే వెల్లడించారు.

ఆచార్య ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు హరీశ్ శంకర్‌ చేసిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కి 'ఆచార్య' సినిమాను ఎప్పుడు చూపిస్తున్నారని హరీశ్ శంకర్ అడగగా... అందుకోసం ఇప్పటికే స్పెషల్ షో బుక్ చేశామని చెప్పారు. కుటుంబమంతా కలిసి సినిమా చూస్తామని చెప్పుకొచ్చారు. అయితే మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఏ థియేటర్‌లో సినిమా చూడబోతున్నారన్నది రివీల్ చేయలేదు.

పశ్చిమ గోదావరి పర్యటన కారణంగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాని పవన్ కల్యాణ్... ఆచార్య స్పెషల్ షోకి వస్తున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఆచార్య సినిమా చూసి పవన్ ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

కాగా, చిరంజీవి-రాంచరణ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ఈ దానం చేస్తే... అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం...

Also Read: TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో కలకలం.. అనూహ్యంగా ప్రత్యక్షమైన మున్నూరు రవి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News