Ram Charan Fans: హద్దులు దాటిన మెగా అభిమానం.. దుర్గగుడిలో అపచారం!

Ram Charan Fans makes noise at Kanaka Durga Temple. హీరో రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న మెగా అభిమానులు ఉదయం 8 గంటల నుంచే గన్నవరం ఎయిర్‌పోర్ట్, దుర్గగుడి వద్దకు భారీ స్థాయిలో వచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 05:53 PM IST
  • మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఆచార్య
  • హద్దులు దాటిన మెగా అభిమానం
  • దుర్గగుడిలో అభిమానుల అపచారం
Ram Charan Fans: హద్దులు దాటిన మెగా అభిమానం.. దుర్గగుడిలో అపచారం!

Ram Charan Fans makes noise at Kanaka Durga Temple in Vijayawada: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం​ 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాకు రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉండంతో రామ్‌ చరణ్‌, కొరటాల శివ బుధవారం విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు. 

అయితే హీరో రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న మెగా అభిమానులు ఉదయం 8 గంటల నుంచే గన్నవరం ఎయిర్‌పోర్ట్, దుర్గగుడి వద్దకు భారీ స్థాయిలో వచ్చారు. చరణ్ ఎయిర్‌పోర్ట్ నుంచి దుర్గగుడికి చేరుకునే క్రమంలో అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అయితే ఇంద్రకీలాద్రికి చేరుకునే సమయానికి వందలాది అభిమానులు చరణ్ తన్మయత్వంలో మునిగిపోయారు. అతడు ముందుకు కదలకుండా చుట్టుముట్టారు. దాంతో ఘాట్ రోడ్ నుంచి అమ్మవారి సన్నిదికి చరణ్ చేరుకోవడానికి నానా అవస్ధలు పడాల్సివచ్చింది. జై చరణ్, జై జై చరణ్ నామస్మరణతో దుర్గగుడి దద్దరిల్లిపోయింది. 

ఓ పక్క సాధారాణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో ఎదురు చూస్తుంటే.. మరోవైపు రామ్ చరణ్ అభిమానులు మాత్రం అమ్మవారిని వదిలేసి మెగా పవర్ స్టార్ కోసం బారీగా ఎగబడ్డారు. అభిమానుల తాకిడికి ఒకానొక దశలో పోలీసులు, పర్సనల్ సెక్యురిటి కూడా చేతులెత్తేశారు. కొందరు మెగా అభిమానులు అమ్మవారి గర్బగుడి ఎదురుగా ఉన్న హుండీలను సైతం ఎక్కడానికి ప్రయత్నించారు. అంతేకాదు చాలామంది అభిమానులు చెప్పులతోనే ఆలయంలోకి వచ్చారు. ఫోటోలు, వీడియోలు, నినాదాలతో అభిమానులు చేసిన రచ్చకు అమ్మవారి భక్తులు తీవ్రనిరాశకు లోనయ్యారు. దుర్గగుడి సెక్యురిటి, పోలీసుల వైఫల్యం కారణంగానే దుర్గగుడిలో అపచారాలు జరిగాయని భక్తులు మండిపడ్డారు.

ఎట్టకేలకు రామ్ చరణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపడింతుల ఆశీర్వచనాలు అందించి.. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. దర్శనం అనంతరం కూడా బయటకు వెళ్లడానికి చరణ్ కష్టపడాల్సి వచ్చింది. అనంతరం చరణ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దర్శనం అనంతరం అనంతరం రామ్ చరణ్‌, కొరటాల శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు వెళ్లారు.

Also Read: Hombale Films New Movie: కేజీఎఫ్ మేక‌ర్స్ భారీ స‌ర్‌ప్రైజ్.. యువరాజ్‌తో కొత్త సినిమా!

Also Read: Sonu Sood First Look: ఆచార్యలో సోనూ సూద్ లుక్ ఇదే.. గతంలో ఎన్నడూ చేయని కారెక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News