Trolls on Anasuya Bharadwaj: బూతులతో రెచ్చిపోయిన దేవరకొండ ఫాన్.. గోడ ఎక్కించిన అనసూయ భరద్వాజ్!

Anasuya Bharadwaj on Fanism: అనసూయ భరద్వాజ్ స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసి చాలామందిని నిద్రలేపాలంటే ఇదే సరైన మార్గం అనిపిస్తోంది అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 6, 2023, 03:30 PM IST
Trolls on Anasuya Bharadwaj: బూతులతో రెచ్చిపోయిన దేవరకొండ ఫాన్.. గోడ ఎక్కించిన అనసూయ భరద్వాజ్!

Abusive Trolls on Anasuya Bharadwaj: విజయ్ దేవరకొండ, అనసూయ భరద్వాజ్ వివాదం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో మొదలైన ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా ఖుషి సినిమా పోస్టర్ ఒకటి అనసూయ భరద్వాజ్ కంట్లో పడడంతో దానిమీద అనసూయ భరద్వాజ్ కామెంట్ చేసింది. విజయ్ దేవరకొండ ‘ది’ పైత్యం అని దూరంగా ఉండడం బెటర్ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేయడంతో ఆమె మీద విజయ్ దేవరకొండ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

నిజానికి ఆమె విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకపోయినా ‘ది’ అనే పదం వాడడంతో విజయ్ దేవరకొండ నే టార్గెట్ చేసిందని భావిస్తూ ఆయన అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. దీంతో తాను చేసేది కరెక్టేనని బంగారు కొండలు అంటే దేవరకొండ అభిమానులు అర్థమయ్యేలా చేస్తున్నారని మరో ట్వీట్ చేసింది.

అయితే విజయ్ దేవరకొండ డై హార్డ్ ఫ్యాన్ అనే పేరుతో ఉన్న ఒక నెటిజన్ అనసూయ మీద బూతులతో విరుచుకుపడ్డాడు. అనసూయ తిన్న జాగానే మరిచిపోయిందని, ది అంటే తెలవదా? అని అంటూనే దారుణమైన విధంగా ఆమెను బూతులతో టార్గెట్ చేసి తిట్టుకొచ్చాడు. ఇక ఇది ట్వీట్ కి అనసూయ డై హార్డ్ ఫ్యాన్ పేరుతో ఉన్న మరో అకౌంట్ చాలా సున్నితంగా క్లారిటీ ఇచ్చింది. ఎవరినైనా వెనకేసుకు రావాలంటే తిట్టాల్సిన అవసరం లేదు, నాకు బూతులు వచ్చు, కానీ మీ అంత ప్రౌడ్ ఫ్యాన్ నేను కాదు నాకు సంస్కారం ఉందని పేర్కొంది.

Also Read: Samantha Reply to Nagachaitanya: మనని అవే దూరం చేశాయి.. నాగచైతన్యకి సమంత కౌంటర్?

దానికి అనసూయ భరద్వాజ్ స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసి చాలామందిని నిద్రలేపాలంటే ఇదే సరైన మార్గం అనిపిస్తోంది, నిజానికి నా పేరుతో ఉన్న ఈ ఫ్యాన్ పేజెస్ అభిమానులు ఎవరు నడుపుతున్నారో నాకు తెలియదు. కానీ మిగతా వాళ్ళలా కాకుండా నేను వాళ్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగాను అంటే నాకు గర్వంగా ఉంది. కంపేర్ చేయడం అనేది అవసరం లేదు కానీ ఇలా కూడా చెప్పవచ్చని చెబుతున్నానని అనసూయ భరద్వాజ్ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత ఆమె మరో ట్వీట్ కూడా చేసింది. ఈ హీరోలందరినీ ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? అర్థం కావడం లేదు. అభిమానం పేరుతో ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టే వాళ్ళని వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు, గొప్ప పవర్ కావాలంటే గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నాకున్న దాంట్లో నేను బాధ్యత గానే ఉంటున్నాను మీరు ఒకవేళ వాళ్ళని కట్టడి చేస్తే మీ ఫ్యాన్ ఫాలోయింగ్ పోతుందనే చేయడం లేదా? అలాంటి ఫాలోయింగ్ లేకుంటే బెటర్ కదండీ అని అంటూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా మరో ట్వీట్ చేసింది.

దీంతో పలువురు మీరంతట మీరు ఏదో వివాదంలోకి వెళ్లి వాళ్ళని గెలుక్కొని, ఇప్పుడు ఆ హీరోలు వాళ్ళని అటెండ్ చేయాలంటే ఎలా మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చి వాళ్ళ అభిమానుల అగ్రహానికి గురవుతున్నారు. మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉంటే వాళ్ళు ఎవరూ మీ జోలికి వచ్చి మిమ్మల్ని టార్గెట్ చేయరు కదా మీరే అనవసరమైన విషయాలు జోలికి వెళ్లి మీరే సమస్యలను తెచ్చుకుని ఇప్పుడు హీరోలు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి అనసూయ ఈ విషయానికి ఏమని సమాధానం చెబుతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి. ఇక ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి. 

Also Read: Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
 

Trending News