Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట

Aadi Sai Kumar Wife Aruna ఆది సాయి కుమార్ భార్య అరుణ తాజాగా ఓ షోకు గెస్టుగా వచ్చింది. ఇంత వరకు బయటకు రాని ఈ జంట వెన్నెల కిషోర్ కోసం వచ్చింది. అలా మొదలైంది అంటూ ఈ మధ్య కొత్త షో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షోకు వెన్నెల కిషోర్, అరుణలు గెస్టులుగా వచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 11:57 AM IST
  • నెట్టింట్లో కొత్త షో సందడి
  • అదరగొడుతున్న వెన్నెల కిషోర్
  • ఆది భార్య అరుణ కోరిక ఇదే
Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట

Aadi Sai Kumar Wife Aruna ఆది సాయి కుమార్ భార్య అరుణ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్‌ఫర్మేషన్ ఉండదు. ఆది కూడా తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా షేర్ చేయడు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు. అయితే మొదటి సారిగా ఆది తన భార్యను ఓ షోకు తీసుకొచ్చాడు. వెన్నెల కిషోర్ చేస్తోన్న అలా మొదలైంది షోకు ఈ జంట గెస్టుగా వచ్చింది. ఇక ఈ షోలోనే తమ పెళ్లి సంగతులు, సంసారం ముచ్చట్లు  పంచుకున్నారు.

ఆది తన అక్క పెళ్లిలో కాస్త హడావిడి చేయడం, అక్కడ సంగీత్‌ను హోస్ట్ చేయడంతో.. అరుణ ఫ్యామిలీ కంట్లో పడ్డాడట. ఆ తరువాత కొన్ని రోజులకు తన బావతో ఈ సంబంధం గురించి మాట్లాడారట. అలా ఒకసారి సాయి కుమార్ బెంగళూరుకు వెళ్లే పని ఉండటం అర్జెంటుగా ఎయిర్ పోర్టులోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారట. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలోనే అలా ఎయిర్ పోర్ట్‌లో మాట్లాడుకున్నామని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

అలా మాట్లాడుకుంటూనే ఉంటూ ఉంటే.. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆపారని నవ్వుకుంటూ చెప్పారు. అలా నాలుగైదు నెలల తరువాత పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తున్నానమని ఆది తన వివాహా బంధం గురించి చెప్పుకొచ్చాడు. ఇక సినిమా ఫ్యామిలీ అని మొదట్లో కంగారు పడిందట అరుణ. లిప్ లాక్స్ వద్దని, అవసరం ఉంటే తప్పా వాటి జోలికి పోవద్దనే ఒకే ఒక్క కండీషన్ ఆదికి అరుణ పెట్టిందట.

ఆది ఎక్కువగా గిఫ్టులు కూడా ఇవ్వని, కానీ ఓ సారి బ్యాగ్‌ను స్పెషల్ ఆర్డర్ చేయించి.. డిజైన్ చేయించి.. వాటి మీద ఏ ఏ అనే లాకెట్‌ను కూడా పెట్టించి ఇచ్చాడు.. అది చాలా స్పెషల్ అని అరుణ మురిసిపోయింది. అయితే అరుణకు మాత్రం ఓ కోరిక ఉండిపోయిందట. ఆది చేతుల మీద ఓ ఆమ్లెట్ వేయించుకుని తినాలనే కోరిక ఉందట.

Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి

అసలు తనకు కాఫీ పెట్టడం తప్పా ఇంకేం రాదని ఆది అంటే.. వెన్నెల కిషోర్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. వెన్నెల కిషోర్ ఆధ్వర్యంలో ఆది కష్టపడుతూ ఆమ్లెట్ వేశాడు. అది టేస్ట్ చూసి బాగుందని చెప్పేసింది అరుణ. ఇది జరుగుతుందని ఎప్పుడూ కూడా అనుకోలేదని సంబరపడిపోయింది. ఇలాంటి చిన్న కోరికలు కూడా ఉంటాయా? ఇంత సింపుల్‌గా కూడా ఉంటాయా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు.

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News