1920 Bheemuni Patnam: కంచర్ల ఉపేంద్ర అపర్ణాదేవి హీరో, హీరయిన్లుగా నటిస్తోన్న చిత్రం '1920 భీమునిపట్నం'. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది.ఈ సినిమాలో కంచర్ల ఉపేంద్ర బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడి కూతురు పాత్రలో అపర్ణా దేవి నటిస్తోంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమాలో అప్పటి ప్రేమకథను చూపించబోతున్నట్టు చెప్పారు. ఈ సినిమాలో హీరో సీతారామ్ పాత్రలో కనిపిస్తే.. సుజాతగా అపర్ణాదేవి నటిస్తోంది. ఈ సినిమాను ఆస్కార్ స్థాయి లెవల్లో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకు సంగీతం, ఫోటోగ్రఫీ హైలెట్‌గా నిలువనున్నాయి. ఈ సినిమాకు కథ నచ్చి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నారట. మొదటి పది రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసిన తర్వాత రాజమండ్రి, విశాఖ పట్నం,అరకు, ఊటీలలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.. భారత స్వతంత్య్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్వేగాల మధ్య నడిచే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అన్ని రియలిస్టిక్‌గా ఉంటాయని చెబుతున్నారు.అపుడు జరిగిన కొన్ని నిజజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఇందులో నటీనటులను ఎంపిక చేసుకున్నాము. మంచి అభిరుచి కలిగిన నిర్మాత దొరకడం మా అదృష్టమన్నారు.
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, "తెలుగు సినిమా ఇపుడు లోకల్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగింది. దాన్ని నిలబెట్టే సినిమా ఇది అవుతుందన్నారు. నా కెరీర్‌లో విభిన్న సినిమా అవుతుందన్నారు. హీరోయిన్ అపర్ణాదేవి మాట్లాడుతూ, కెరీర్ తొలి రోజుల్లోనే ఇలాంటి సినిమా దొరకడం తన అదృష్టమన్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించడం తన లక్ అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో యండమూరి ప్రవీణ్, ఘర్షణ శ్రీనివాస్, పవిత్ర లోకేష్, తిలక్, జెన్నీ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సినిమాటోగ్రఫీ: ఎస్.మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, కళ: సురేష్ భీమగాని, సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, నిర్మాత: కంచర్ల అచ్యుతరావు, రచన, దర్శకత్వం: నరసింహ నంది
Read More: Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.