Jr. NTR into AP Politics: ఏపీ రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

 Nara Lokesh About Jr NTR : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎంట్రీ గురించి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎప్పుడు వచ్చినా నూటికి నూరు శాతం ఆహ్వానం పలుకుతామని లోకేష్ అన్నారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 24, 2023, 07:25 PM IST
Jr. NTR into AP Politics: ఏపీ రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

 Nara Lokesh welcomed Jr. NTR into AP Politics: చాలా రోజుల నుంచి నారా లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక విషయంలో జాగ్రత్త పడుతుందని ప్రచారం ఉంది. నందమూరి తారక రామారావు జూనియర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయితే లోకేష్ కి పోటీ అవుతాడని అందుకే ఆయనని పార్టీకి దూరంగా పెడుతున్నారని ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటుంది. అయితే పార్టీకి అవసరం అనుకుంటే తాను ఎప్పుడైనా వస్తాను అని అటు జూనియర్ ఎన్టీఆర్ అంటుంటే ఆయన ఎప్పుడు పార్టీలోకి వచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టీడీపీ శ్రేణులు ఇప్పుడు వరకు చెబుతూ వచ్చాయి.

అయితే మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లోకి వచ్చే విషయం మీద నారా లోకేష్ స్పందించాడు. ప్రస్తుతానికి యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ప్రతిరోజు సాయంత్రం సమయంలో యువతతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఒజూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ లోకి వస్తారా అనే విషయం మీద నారా లోకేష్ స్పందించారు. జూనియర్ ఎన్ఠీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అని నన్ను అడిగారు, అయితే నేను నూటికి నూరు శాతం ఆహ్వానిస్తా అని లోకేష్ అన్నారు.

ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు  ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రలో మార్పు రావాలి, ఈ రాష్ట్రము అగ్రస్థానంకి వెళ్ళాలి, ఆంధ్రుల గర్వపడేలా ఉండాలి అని ఆశిస్తారో  వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని నారా లోకేష్ కామెంట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి దగ్గరగా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే 2009 ఎన్నికల్లో కూడా ఆయన ఏపీలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజులు ఉందని ఉగాది పండుగ ఇంట్లో జరుపుకునేందుకు  వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారనే చెప్పాలి.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదన్నట్లుగా టిడిపి నేతలు ప్రవర్తించారు. కానీ 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన దగ్గర నుంచి నేరుగా చంద్రబాబుకు కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి అందించాలి అనే డిమాండ్లు వినిపించారు కొందరు. అయితే ఈ విషయం మీద తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇప్పుడు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రవేశం గురించి కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

Also Read: Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!

Also Read: Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News