Meerut Woman: బలవంతం చేయబోతే కొరికేసిన మహిళ.. దెబ్బకు ఊడిపోయింది

Woman Cut Youth Lip After Tried To Kiss: ఆమె ఒంటరిగా ఉందని కన్నేశాడు. పొలంలో పని చేసుకుంటుండగా వెనుక నుంచి వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. భయపడిపోయిన మహిళ అరిచేందుకు యత్నించగా గొంతు నొక్కి చంపేస్తానని బెదిరించాడు. ఆ తరువాత మహిళ ధైర్యంతో యువకుడితో పోరాడి తనను తాను రక్షించుకుంది. ఎలాగంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2023, 05:27 PM IST
Meerut Woman: బలవంతం చేయబోతే కొరికేసిన మహిళ.. దెబ్బకు ఊడిపోయింది

Woman Cut Youth Lip After Tried To Kiss: ఓ మహిళ ఎంతో ధైర్యసాహాసాలు ప్రదర్శించింది. పొలంలో పనిచేసుకుంటుండగా.. ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. బలవంతంగా ముద్దు పెట్టేందుకు యత్నించగా.. మహిళ చాకచాక్యంగా వ్యవహరించింది. వెంటనే యువకుడి పెదాలను గట్టిగా కొరికేసింది. దీంతో దెబ్బకు యువకుడి పెదవి ఊడిపోయి కింద పడిపోయింది. రక్తస్రావంతో మహిళను యువకుడు విడిచిపెట్టి నొప్పితో విలవిలాడిపోగా.. ఆమె వెంటనే గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో చోటు చేసుకుంది. 

మీరట్‌లోని దౌరాలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అజౌతా అనే గ్రామ పరిధిలో వేధింపులకు పాల్పడుతున్న యువకుడి పెదవులను కొరికి మహిళ గాయపరిచింది. శనివారం కాళీ నది ఒడ్డున తమ పొలంలో ఆమె పని చేసుకుంటుండగా.. లావాడ్‌కు చెందిన ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. సడెన్‌గా వెళ్లి మహిళను వెనుక నుంచి పట్టుకున్నాడు. దీంతో భయపడిపోయిన మహిళ గట్టిగా అరిచేందుకు యత్నించగా.. యువకుడు గొంతు పట్టుకున్నాడు. తరువాత ఆమెను పొలంలోకి లాక్కెళ్లి బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడు. లొంగకపోతే చంపేస్తానని బెదిరించాడు. 

బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఇదే అదనుగా ఆ యువకుడి పెదవిని గట్టిగా కొరికింది. దెబ్బకు అతని పెదవి ఊడిపోయి కిందపడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే మహిళను యువకుడు విడిచిపెట్టాడు. నొప్పితో ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి యువకుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందివ్వగా.. ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెదవిని ఓ ప్యాకెట్‌లోకి తీసుకువెళ్లి యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై చర్యలు తీసుకుంటున్నట్లు స్టేషన్‌ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్‌ శర్మ తెలిపారు. నిందితుడు మోహిత్‌ సైనీ నివాసి లవన్‌గా గుర్తించారు. 

Also Read: Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు షాక్.. కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన  

Also Read: FD Interest Rates 2023: ఈ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు పెంపు.. డిపాజిట్ చేస్తే భారీ లాభం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News