Karnataka Murder Case: కర్ణాటకలో శ్రద్ధా తరహా హత్య ఘటన.. తండ్రి హత్య చేసి 32 ముక్కలుగా నరికి..

Son Kills Father in Karnataka: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని హత్య చేసి.. 32 ముక్కలుగా నరికాడు. ఎవరికి తెలియకుండా శరీర భాగాలను ఓ బావిలో పడేశాడు. చివరకు పోలీసులు నిందితుడు పట్టుకుని జైలుకు తరలించారు. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 06:08 PM IST
Karnataka Murder Case: కర్ణాటకలో శ్రద్ధా తరహా హత్య ఘటన.. తండ్రి హత్య చేసి 32 ముక్కలుగా నరికి..

Son Kills Father in Karnataka: ఢిల్లీకి చెందిన శ్రద్ధా హత్య తరహా ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఓ యువకుడు తన తండ్రిని హత్య చేసి.. మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను బోరుబావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మృతుడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విఠల కులాలిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 6న 20 ఏళ్ల విఠల తన తండ్రి పరశురామ్ కులాలి (53)ను ఆవేశంతో ఇనుప రాడ్‌తో హత్య చేశాడు. పరశురాం తన ఇద్దరు కుమారులలో విఠల చిన్నవాడు. మద్యం తాగి వచ్చి తరచూ ఇంట్లో దుర్భాషలాడేవాడు. పరశురాముడి భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. విఠలతో కలిసి తండ్రి పరశురామ్ ఉంటున్నాడు.  

గత మంగళవారం కూడా తండ్రిని విఠల వేధించాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కొడుకు ఇనుప రాడ్‌ తీసుకుని తండ్రిని హతమార్చాడు. హత్యానంతరం పరశురాముడి శరీరాన్ని 32 ముక్కలుగా నరికాడు. బాగల్‌కోట్ జిల్లా ముధోల్ శివార్లలోని మంటూరు బైపాస్ సమీపంలో ఉన్న తన పొలంలో ఉన్న బోరుబావిలో మృతదేహం ముక్కలను విసిరాడు. 

బోరుబావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు విఠలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా.. నేరం అంగీకరించినట్లు తెలిసింది. మృతదేహం ముక్కలను పోస్టుమార్టానికి తరలించారు. 

ఢిల్లీలో శ్రద్దా అనే యువతిని అఫ్తాబ్ హత్య చేసి.. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలన రేకిత్తించిన ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక ఆధారాలను పోలీసులు సేకరించారు. మరిన్ని కీలక ఆధారాలు సేకరించాల్సి ఉంది.

Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ బహుమతి.. 18 నెలల డీఏ పెండింగ్ కేంద్ర నిర్ణయం..?  

Also Read: Amit Shah: మోదీ ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం: హోంమంత్రి అమిత్ షా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News