MLA Kasireddy Accident: ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి.. ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి

MLA Kasireddy Narayana Reddy Car Accident Two Bikers Died: ఎన్నికల ప్రచారంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 6, 2024, 07:27 PM IST
MLA Kasireddy Accident: ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి.. ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి

MLA Car Accident: కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంటున్నాయి. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచార సభలో ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. అది మరవకముందే కాంగ్రెస్‌ మరో ప్రచార సభలో ఘోర ప్రమాదం సంభవించింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: White House: అమెరికా అధ్యక్ష నివాసం వద్ద కలకలం.. గేటును ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి

కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక చోట ప్రచారం ముగించుకుని మరో ప్రాంతానికి బయల్దేరారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామ శివారులోకి రాగానే అతడు ప్రయాణిస్తున్న కారు బైక్‌పై వెళ్తున్న యువకులను ఢీకొట్టింది. రామసిపల్లి మైసమ్మ దేవాలయ సమీపంలో మిడ్జిల్- వెల్జాల్ రహదారిపై కారు ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లింది.

Also Read: Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జ్‌పై బర్త్‌ డే వేడుకలు.. పోలీసులైతే రూల్స్‌ వర్తించవా?

బైక్ మీద వెళ్తున్న పబ్బతి నరేశ్‌ (25) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైరవపాక పరుశరాములు (40) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో తుదిశ్వాస విడిచాడు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా కారు కూడా దెబ్బతిన్నది. పొదల్లోకి దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. కారు ముందు భాగం దెబ్బతినగా.. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు.

కాగా ప్రమాదం విషయం తెలుసుకున్నా కూడా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బాధితులను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన పార్టీ నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ప్రచార కార్యక్రమానికి వెళ్లారని సమాచారం. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రచార కార్యక్రమం ముగించుకున్న అనంతరం ఎమ్మెల్యే బాధిత కుటుంబసభ్యులను కలిశారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News