Hyderabad Gun Firing: నాగోలులో బంగారం దుకాణంలో కాల్పులు జరిపి బంగారం చోరీ

Nagole Jewellery Shop Theft: నాగోలులో గురువారం రాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జువెలరీ షాపులో చొరబడిన దొంగలు దుకాణంలో కాల్పులకు పాల్పడి బంగారం ఎత్తుకెళ్లారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 10:26 PM IST
  • నాగోలులోని స్నేహపురి కాలనీలో కాల్పుల కలకలం
  • బంగారం దుకాణంలోకి చొరబడిన దుండగులు
  • దుకాణంలో కాల్పులు జరిపి బంగారం చోరీ
Hyderabad Gun Firing: నాగోలులో బంగారం దుకాణంలో కాల్పులు జరిపి బంగారం చోరీ

Nagole Jewellery Shop Theft: హైదరాబాద్: నగరంలోని నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పులు కలకలం చోటుచేసుకుంది. ఓ బంగారు నగల దుకాణంలో చొరబడిన ఇద్దరు దుండగులు.. అక్కడి వారిపై కాల్పులు జరిపి బంగారం చోరీకి పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం అందుతోంది. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి బంగారం దుకాణంలో పనిచేసే సిబ్బందినా లేక యజమాని కుటుంబానికే చెందిన వ్యక్తినా అనేది తెలియాల్సి ఉంది. తనని తుపాకీతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లినట్టు బంగారం దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

యజమాని ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు ఎంతమంది వచ్చారు, దాడి ఎలా జరిగింది అనే సీన్ ఆఫ్ అఫెన్స్ వివరాలను దుకాణం యజమానితో పాటు ప్రత్యక్షసాక్షుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

దుకాణం యజమానితో విభేదాలు ఉన్న వారెవరైనా ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ నేరానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలోనూ తెలంగాణ, ఏపీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉండటంతో ఆయా ఘటనలకు పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. 

Also Read : Shraddha Murder Case: ఫ్రిజ్‌లో శ్రద్ధా మృతదేహం ఉందని తెలియదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన అఫ్తాబ్ గర్ల్‌ఫ్రెండ్

Also Read : New Love story: వింత ప్రేమ.. నలుగురు ముసలోళ్లతో ‘ఆంటీ’ లవ్.. ఐదో వ్యక్తి ఎంట్రీతో మొహం చెక్కేశారు!

Also Read : Rapido Driver Rape: మందేసి బండెక్కిన యువతి, మరో అమ్మాయితో కలిసి ఇంటికి తీసుకెళ్లి రాపిడో డ్రైవర్ గ్యాంగ్ రేప్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News