Teen Girl Stabbed In Eyes: కళ్లలో స్క్రూ డ్రైవర్‌తో పొడిచి, గొంతు కోసి..

Teen Girl Stabbed In Eyes: వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. స్క్రూ డ్రైవర్ తో కళ్లలో పొడిచిన దుండగులు.. ఆ తరువాత బ్లేడుతో ఆమె గొంతు కోసి ప్రాణం తీశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2023, 05:13 PM IST
Teen Girl Stabbed In Eyes: కళ్లలో స్క్రూ డ్రైవర్‌తో పొడిచి, గొంతు కోసి..

Teen Girl Stabbed In Eyes: వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. స్క్రూ డ్రైవర్ తో కళ్లలో పొడిచిన దుండగులు.. ఆ తరువాత బ్లేడుతో ఆమె గొంతు కోసి ప్రాణం తీశారు. యువతిని చంపిన అనంతరం ఆమె శవాన్ని కాలాపూర్ గ్రామంలోని చెరువులో పడేసి పారిపోయారు. మృతురాలిని జుట్టు శిరీష అనే యువతిగా గుర్తించారు. జూన్ 10న రాత్రి 11 గంటల ప్రాంతంలో యువతి ఇంటి నుంచి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అలా ఇంటి నుంచి వెళ్లిన యువతి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తమ బంధువులు, అమ్మాయి స్నేహితుల వద్ద ఆరా తీశారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. 

చెరువులో లభించిన శవం..
యువతి కనిపించకుండా పోయిన అనంతరం కుటుంబసభ్యులు అంతటా ఆరా తీస్తున్న సమయంలోనే కాలాపూర్ గ్రామస్తుల ద్వారా వారికి ఒక దుర్వార్త అందింది. చెరువులో ఒక యువతి శవం పడి ఉందని.. అది రక్తంలో ముంచి తీసినట్టుగా ఉంది అని గ్రామస్తుల నుంచి సమాచారం అందింది. మనసులో ఏదో తెలియని భయంతోనే యువతి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఏదైతే జరగకూడదు అని అనుకున్నారో అదే జరిగింది. ఆ యువతి శవం తమ శిరీషది అయ్యుండకూడదు అని కోరుకున్నప్పటికీ.. అక్కడికి వెళ్లి చూశాకా కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. 

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వికారాబాద్ జిల్లా పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. యువతి హత్య జరిగిన తీరు తెన్నులను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు చేపడితే కానీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం లేదు అని వికారాబాద్ పోలీసులు స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Nallajerla Road Accident: లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

ఇది కూడా చదవండి : Bank Manager Death Case: మహిళల లోదుస్తులు ధరించి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య.. ఉరితాడుకు ఆ దుస్తుల్లోనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News