Free Bus: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పలు చేదు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ పథకం వలన మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉచిత బస్సు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడంతో బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. కూర్చోవడానికి సీటు లేక ప్రయాణికుల మధ్య చిక్కుకున్న వృద్ధుడు ఊపిరాడక అస్వస్థతకు గురై మరణించాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటుచేసుకుంది.
Also Read: Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం
నిజామాబాద్‌కు చెందిన బోగం సాంబయ్య (65) మెట్‌పల్లికి వచ్చాడు. తిరిగి నిజామాబాద్ వెళ్లేందుకు గురువారం హుజురాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. అయితే అప్పటికే బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఏ బస్సు చూసినా అలాగే ఉండడంతో ఈ బస్సు ఎక్కారు. సీట్లు లేక నిలబడి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉండడంతోపాటు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉక్కపోతకు గురయ్యాడు. శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందులకు గురై బస్సులోనే అస్వస్థతకు గురయ్యాడు. వెంకట్రావుపేట గ్రామానికి చేరుకోగానే అతడి పరిస్థితి తీవ్రంగా మారడంతో వెంటనే ప్రయాణికులు బస్సును పక్కకు ఆపారు.
Also Read: Cricket Betting: ఐపీఎల్ బెట్టింగ్‌కు భార్య బలి.. రూ.కోటిన్నర అప్పులతో సంసారం సర్వనాశనం
అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేసి సాంబయ్యను మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేర్చేలోపు సాంబయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడి మరణానికి ఊపిరాడకపోవడమే కారణమని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఒత్తిడికి గురై సాంబయ్య మృతి చెందాడని వైద్యులు వివరించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉచిత బస్సు పథకం అమలుతో అతడు మృతి చెందడం కలకలం ఏర్పడింది. ఉచిత బస్సు అమలు చేస్తున్నా పెరిగిన ప్రయాణికులకు తగ్గ బస్సులు పెంచకపోవడంతో బస్సులన్నీ తీవ్ర రద్దీగా ఉంటుండడంతో గొడవలు, ముష్టిఘాతాలు, పరస్పరం దాడులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook