Shraddha Walker Aftab Amin Poonawalla Case: శ్రద్ధా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాను కోర్టులో హాజరు పర్చగా.. శ్రద్ధాను హత్య చేసినట్లు జడ్జి ముందు నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఢిల్లీ కోర్టు అఫ్తాబ్ పోలీసు కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2020లో అఫ్తాబ్‌పై శ్రద్ధా తులింజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు సంబంధించిన ఫోన్ నంబర్లు పోలీసులకు ఇచ్చి.. తనను వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది. బీ-302, రీగల్ అపార్ట్‌మెంట్, విజయ్ నిహార్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నామని.. అఫ్తాబ్ తనను నిత్యం కొడుతూ వేధిస్తున్నాడని తెలిపింది.
తనను ఊపిరాడకుండా చంపేందుకు ప్రయత్నించాడని.. తనను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది. తామిద్దరం కలిసి జీవిస్తున్న విషయం అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసని.. వారు వారంతాల్లో వచ్చి వెళతారని తెలిపింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని అతని కలిసి ఉన్నానని చెప్పింది. ఇక నుంచి తాను అతనితో కలిసి జీవించనని.. తాను శారీరక హింసను భరించలేకపోతున్నాని తెలిపింది. ఈ కేసులో అప్పట్లో పోలీసులు అఫ్తాబ్‌ను పిలిపించారు.
ఈ విషయం తెలుసుకున్న అఫ్తాబ్ తల్లిదండ్రులు కేసును ఉపసంహరించుకోవాలని శ్రద్ధాను కోరారు. వారి మాట విన్న శ్రద్ధా కంప్లైంట్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో అఫ్తాబ్‌ను పోలీసులు ప్రశ్నించకుండా పంపించేశారు. కేసును వెనక్కి తీసుకు శ్రద్ధా తప్పుచేసినట్లైంది. ఆ తరువాత నిందితుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి వాటిని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. కస్టడీలో ఉన్న నిందితుడి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. బుధవారం అతనికి నార్కో పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Also Read: Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు
Also Read: Delhi Murder: ఢిల్లీలో మరో దారుణం.. తండ్రి, అక్కాచెల్లెళ్లు, బామ్మను హత్య చేసిన యువకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి