Rold Gold Fraud Case: రోల్డ్‌ గోల్డ్‌ రూ.60 లక్షలకు ఆశ చూపి..3 లక్షలకు నామం పెట్టాడు..

Rold Gold Fraud Case: అత్యాశ కారణంగా చాలా మంది కోట్లకు కోట్లు నష్టపోయారు. ఇటీవలే ఇలాంటి సంఘటనే భయటపడింది. ఈ సంఘటన అందరికీ వింతగా అనిపించినా..అత్యాశ కారణంగా కలిగే నష్టాన్ని అందరికీ తెలిసేటట్లు చేసింది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 29, 2023, 10:45 AM IST
Rold Gold Fraud Case: రోల్డ్‌ గోల్డ్‌ రూ.60 లక్షలకు ఆశ చూపి..3 లక్షలకు నామం పెట్టాడు..

 

Rold Gold Fraud Case: అత్యాశ కారణంగా రాజులే రాజ్యాలను కోల్పోయిన రోజులు ఉన్నాయి. ఉండడం వేరు అత్యాశ ఉండడం వేరు.. అయితే ఇటీవలే అత్యాశ కారణంగా ఓ వ్యక్తి ఎంతలా మోసపోయాడో తెలుసా? సాధారణంగా కేజీ బంగారం మార్కెట్ ధరలో రూ. 60 లక్షలకు పైగా ఉంటుంది. కానీ ఓ ఘరానా మోసగాడు కేవలం 3 లక్షలకే ఇస్తామని చెప్పి అత్యాశపడ్డ వ్యక్తికి టోకరా పెట్టాడు. చివరికి నకిలీ బంగారం అతని చేతిలో పెట్టి మూడు లక్షల రూపాయలు ఎత్తుకొని పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

నకిలీ బంగారమని ఆలస్యంగా తెలుసుకున్న ఆనంద్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా ఈయన కూలీ కష్టం చేస్తూ బట్టల దుకాణాన్ని నడిపిస్తున్నాడు. ఈనెల ఆయన బట్టల షాప్ కి వచ్చి ఓ వ్యక్తి కొన్ని బట్టలు కొనుగోలు చేసి ఆనందుతో పాటలు కలిపేశాడు. నిజామాబాద్ పరిసర గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటూ ఉంటానని ఆ ఘరానా మోసగాడు ఆనందుతో అన్ని షేర్ చేసుకున్నాడు. ఇలా బాధితుడు ఆ మోసగాడు చెప్పినవన్నీ నమ్మేశాడు. 

Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?

తను పనిచేసే చోట తవ్వకాలు జరిపినప్పుడు బంగారపు హారం దొరికిందని.. ఇది కేజీకి పైన ఉంటుందని ఆనందుతో చెప్పి షాప్ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత మరుసటి రోజు ఆనంద్ షాప్ కి మళ్లీ ఓ మహిళను వెంట తీసుకొని అతను వచ్చాడు. వచ్చే క్రమంలో వారి దగ్గర ఉన్న నకిలీహారాన్ని తీసుకువచ్చారు. ఈ హారాన్ని ఆనంద్ ఇచ్చి మీకు ఇష్టం వచ్చిన చోటకి తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఆనంద్ ఆహారంలో నుంచి ఓ చిన్న భాగాన్ని కట్ చేసి స్వర్ణకారుల దగ్గరికి తీసుకువెళ్లి పరీక్షించారు. ఈ పరీక్షలో భాగంగా గుండు అసలైన బంగారమని తేలింది. దీంతో ఆనంద్ వారికి ఈ మొత్తం బంగారాన్ని రూ 3 లక్షలకు అమ్మమని బేరం కుదుర్చుకుంటారు. 

ఇలా ఆనంద్ డబ్బు సర్దుబాటు అయిన తర్వాత రెండు రోజులకి వారికి డబ్బులు అప్పజెప్పి హారాన్ని తీసుకుంటాడు. ఆ మరుసటి రోజు దానిని అమ్మేందుకు ఆనంద్‌ మరో చోట పరీక్షించాడు. దీంతో ఆ హారం నకిలీదని తేలింది. మోసపోయాడని తెలుసుకున్న బాధితుడు ఇటీవలే నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు మోసం చేసిన వారిద్దరి గాలించేందుకు రంగం సిద్ధం చేశారు. 

Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News