Tragedy: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. రాళ్లు, కర్రలతో కొట్టి బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య

BRS Party Karyakarta Brutally Killed By Congress Leaders: గ్రామంలో రోడ్డు నిర్మాణం విషయమై చెలరేగిన ఘర్షణ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల హత్యకు దారి తీసింది. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అతడిపై దాడికి పాల్పడి ప్రాణం తీశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 21, 2024, 07:17 PM IST
Tragedy: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. రాళ్లు, కర్రలతో కొట్టి బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య

Sangareddy District: అధికారం మారిన తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయి. గ్రామంలో రోడ్డు నిర్మాణం ప్రశ్నించిన పాపానికి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  ఈ ఘటనపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది.

Also Read: Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు

 

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం సింగార్ బోగుడ తండాలో 2023లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు మంజూరైంది. వివిధ కారణాలతో ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యమైంది. ఈలోపు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ రోడ్డు నిర్మాణంపై కదలిక వచ్చింది. అయితే గతంలో నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించడం వివాదం రేపింది.

Also Read: Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీత

 

ఈ విషయమై మాట్లాడేందుకు ఆదివారం తండావాసులు గ్రామంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో వివాదం మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు శ్రీను నాయక్ (25) మీద కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో కొట్టి విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గాయపడిన శ్రీనును వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు శ్రీను నాయక్‌పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని తెలుస్తోంది. శ్రీను మృతితో అతడిపై దాడి చేసిన వ్యక్తులు తండా నుంచి పారిపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పార్టీ కార్యకర్త శ్రీను నాయక్‌ మృతికి సంతాపం తెలుపుతూనే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందిరమ్మ రాజ్యం అంటే రౌడీ రాజ్యమా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షపూరిత రాజకీయాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. గ్రామాల్లో మళ్లీ రౌడీ రాజ్యం మొదలైందని విమర్శించారు. వెంటనే పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి శ్రీను నాయక్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News