Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు

Actor Santosh Case: సినీ పరిశ్రమపై ఎన్నో ఆశలతో పట్టణానికి అడుగుపెట్టిన యువతి మోసగాడి చేతిలో చిక్కింది. సినిమా అవకాశాలు కాకుండా అతడు తన 'అవకాశం' తీర్చుకున్నాడు. తోటి నటుడే అని నమ్మితే అతడి చేతిలోనే బలైన సంఘటన సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 20, 2024, 03:25 PM IST
Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు

Actor Santhosh Booked Blackmailing Case: సినీ పరిశ్రమ అనేది ఎంత అందమైన ప్రపంచమో.. అంతటి అగాధ పరిశ్రమ కూడా. అవకాశం వస్తే అందలమెక్కుతారు.. అవకాశాలు రాకుంటే అధపాతాళంలోకి వెళ్తారు. సినీ పరిశ్రమ పేరు చెప్పుకుని చాలా మోసాలు జరుగుతున్నాయి. తాజాగా సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి ఓ యువతిని నటుడు మోసం చేశాడు. అతడి మాటలను నమ్మి 'సర్వం' సమర్పించుకున్న యువతిని ఇప్పుడు అతడు పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది.

Also Read: Belgrade Airport: 'పెద్ద రంధ్రం'తోనే గాల్లో ఎగిరిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి (27) స్థానికంగా బ్యూటీషియన్‌గా పని చేస్తుండేది. సినిమాల్లో పని చేయాలని ఆమెకు ఆశ ఉండేది. సినిమాల్లోకి ప్రవేశించాలనే లక్ష్యంతో యువతి కుటుంబసభ్యులతో కలిసి 2019లో బెంగళూరుకు చేరుకుంది. అప్పటి నుంచి సినిమా అవకాశాల కోసం బెంగళూరులో తిరుగుతోంది. ఈ సమయంలో నటుడు సంతోష్‌ పరిచయమయ్యాడు. అతడు కన్నడ, తమిళంలోని పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఆమెకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు.

Also Read: TS High Court: పోలీసులకు 'క్లాస్‌' తీసుకోవాలి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు సూచన

అనంతరం ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ప్రేమించానని చెప్పి మరింత దగ్గరయ్యాడు. సినిమా అవకాశాలు, ప్రేమ రెండూ మాటలు చెప్పడంతో ఆ యువతి సర్వం సమర్పించుకుంది. మైసూర్‌, గోవా తదితర ప్రాంతాలకు ఆమెను తీసుకువెళ్లాడు. అక్కడ కోరికలు తీర్చుకున్నాడు. ఆ సమయంలో యువతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీశాడు. ఇక ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఫొటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని యువతి నుంచి నగదు, ఖరీదైన సెల్‌ఫోన్‌, ఆభరణాలు లాక్కున్నాడు.

కొద్దిరోజులకు సంతోష్‌ గురించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడికి అప్పటికే వివాహమైందని, అత్తిబెలెలో కాపురం ఉంటున్నాడని తెలిసింది. విషయం తెలుసుకున్న యువతి అతడి ఇంటికి వెళ్లి నిలదీయగా.. 'అల్లరి చేయొద్దు. చేస్తే చంపేస్తా' అని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి అత్తిబెలె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లు పట్టించుకోకపోవడంతో యువతి జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిబ్రవరి 14న తన ఇంటికి వచ్చి గొడవకు దిగాడని, దాడి చేశాడని బాధితురాలు వాపోయింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే సంతోష్‌ గతంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డాడని తేలింది. సంతోష్‌ ఇలా మరికొందరిని కూడా మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అతడి బారినపడిన బాధితులు మరికొందరు ఉన్నారని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News