Kakinada Public Prosecutor Murder: కాకినాడకి చెందిన స్పెషల్ పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అక్బర్ ఆజాం మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అక్బర్ ఆజాంది సహజ మరణమేనని అంతా భావించినప్పటికీ ఆయన హత్యకు గురయ్యారని తాజాగా వెల్లడైంది. ఆజాం మృతి చెందిన 59 రోజుల తర్వాత అసలు విషయం బయటడింది. ఆజాం భార్యే ఆయన్ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే... కాకినాడ స్పెషల్ పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అక్బర్ ఆజాం (50) ఈ ఏడాది జూన్ 23న మృతి చెందారు. ఆయనది సహజ మరణంగానే భావించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆజాం మృతి చెందడానికి కొద్ది నెలల ముందు ఆయన తన భార్యకు కొత్త ఫోన్ కొనిపెట్టారు. ఆమె పాత ఫోన్‌ని ఆజాం తన తండ్రి హుస్సేన్‌కి ఇచ్చి వాడుకోమన్నారు. అప్పటినుంచి ఆజాం తండ్రి అదే ఫోన్ వాడుతున్నారు.
ఆజాం మృతి చెందిన కొద్దిరోజులకు ఆ ఫోన్లో వాట్సాప్ చాటింగ్స్, వాయిస్ మెసేజ్‌లను హుస్సేన్ గమనించారు. ఆజాం ఇంటిపై నివాసముండే రాజేష్ జైన్ అనే వ్యక్తితో ఆమె సన్నిహిత సంభాషణలు అందులో బహిర్గతమయ్యాయి. దీంతో ఈ నెల 17న హుస్సేన్ తండ్రి ఆజాం భార్య అహ్మదున్నీసా (36)పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల ఫిర్యాదులో అహ్మదున్నీసానే అక్బర్ ఆజాంను హత్య చేసినట్లు తేలింది. జూన్ 23న భర్తకు ఆమె నిద్రమాత్రలు ఇవ్వడంతో అతను గాఢ నిద్రలోకి వెళ్లాడు. ఆ తర్వాత రాజేష్ జైన్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు. వెంట తెచ్చిన క్లోరోఫాంను కిరణ్ ఒక గుడ్డలో వేసి ఆజాం ముక్కు వద్ద అదిమిపట్టాడు. మత్తు డోసు ఎక్కువవడంతో ఆజాం నిద్రలోనే మృతి చెందాడు. ఆజాం భార్య అహ్మదున్నీసా, మరో ఇద్దరు నిందితులు రాజష్ జైన్,కిరణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook