Ganesh Immersion: గణేశ్‌ ఉత్సవాల వేళ తెలంగాణలో మతసామరస్యం.. ఏపీలో ఉద్రిక్తత

High Tension In Machilipatnam Ganesh Immersion: తెలుగు రాష్ట్రాల్లో గణేశ్‌ ఉత్సవాల వేళ కొన్ని ఉద్రిక్తత సంఘటనలు చోటుచేసుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం మత సామరస్యం వెల్లివిరిసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 15, 2024, 06:57 PM IST
Ganesh Immersion: గణేశ్‌ ఉత్సవాల వేళ తెలంగాణలో మతసామరస్యం.. ఏపీలో ఉద్రిక్తత

Ganesh Visarjan 2024: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్నాయి. 9 రోజుల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వినాయక నిమజ్జనం చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని అపశ్రుతి సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిమజ్జనం చేసే సమయంలో పరిస్థితి అదుపు తప్పి ఒకరు మృతి చెందగా.. ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. ఒక చోట ఇతర వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారు. అయితే తెలంగాణలో మాత్రం మత సామరస్యం వెల్లివిరుస్తోంది. ఓ ముస్లిం వ్యక్తి వేలం పాటలో లడ్డూను దక్కించుకోవడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Bag Creats Tension: రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్‌ కలకలం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు

అపశృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో కొందరు యువకులు వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9వ రోజు సందర్భంగా వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. పాలెం గ్రామం వద్ద ఏలేరు కాలవలో నిమజ్జనం చేయడానికి వీరవరం గ్రామ యువకులు వచ్చారు. అయితే నిమజ్జనం సమయంలో పొరపాటున నలుగురు యువకులు గల్లంతయ్యారు. అతి కష్టంగా ఈదుకుంటూ ముగ్గురు యువకులు ఒడ్డుకు చేరుకున్నారు. కానీ ఒక యువకుడు లక్ష్మణ్ మాత్రం మృతి చెందాడు. దీంతో వినాయక ఉత్సవంలో వారి కుటుంబంలో, యువకుల్లో తీవ్ర విషాదం నింపింది.

Also Read: She Teams: ఖైరతాబాద్‌ గణేశ్‌ వద్ద పోకిరీల వెకిలి చేష్టలు.. 285 మంది అరెస్ట్‌

 

ఇతర వర్గంతో ఘర్షణ
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఊరేగింపు సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మచిలీపట్నంలోని 8వ డివిజన్  అంజమ్మ కాలనీ లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో ఏర్పడిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. మద్యం మత్తులో ఊరేగింపులో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు రఫీ ఇంటిపై రాళ్లు విసిరి ఇంట్లోకి చొరబడ్డారు. రఫీ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతడితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఈ ఘటనపై ఇరు వర్గాలు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. నిమజ్జనం సమయంలో పోలీసుల పర్యవేక్షణ లోపం ఉందని స్థానికులు ఆరోపించారు. తన ఇంటిపై రాళ్లు వేశారని బాధితుడు రఫీ ఫిర్యాదులో చెప్పాడు. 'ఫిర్యాదు ఇచ్చి ఇంటికి వెళ్లగానే మాపై ఫిర్యాదు చేస్తావా నీకు అంత ధైర్యం' అంటూ రఫీ తల పగలగొట్టారని కుటుంబసభ్యులు వాపోయాు. వెంటనే రఫీ రోడ్డుపైకి పరిగెట్టగా ఎస్సై వచ్చి అతడిని దాడి నుంచి రక్షించినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయాలపాలైన రఫీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెల్లివిరిసిన మతసామరస్యం
తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరిసింది. పలుచోట్ల గణేశ్‌ లడ్డూలను కొందరు ముస్లిలు దక్కించుకున్నారు. కొత్తగూడెం భద్రాద్రి, వరంగల్‌ జిల్లాల్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. అశ్వాపురం మండలం చవిటిగూడెంలో షేక్ అష్రఫ్ అనే యువకుడు వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముతోజీపేటలో గణపతి ఉత్సవాలకు మహ్మద్ రియాజ్ అనే యువకుడు 216 కిలోల భారీ లడ్డూను అందించి భక్తిభావాన్ని చాటుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News