Google Pay Alert: ఆ యాప్ ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండి, లేకపోతే మీ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది

Google Pay Alert: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్ నడుస్తోంది. యూపీఐ చెల్లింపులు అందుబాటులో రావడంతో సెక్షన్ వ్యవధిలో లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొన్ని కీలకమైన సూచనలు చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2023, 07:37 AM IST
Google Pay Alert: ఆ యాప్ ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండి, లేకపోతే మీ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది

Google Pay Alert: ఆన్‌లైన్ లావాదేవీల వినియోగం పెరిగే కొద్దీ మోసాలు అధికమౌతున్నాయి. ముఖ్యంగా యూపీఐ వినియోగం చాలా ఎక్కువైంది. దేశంలో అత్యధికంగా వినియోగించే యూపీఐల జాబితాలో గూగుల్ పే ఒకటి. తన యూజర్లు నష్టపోకుండా ఉండేందుకు గూగుల్ కొన్ని కీలకమైన సూచనలు చేసింది. 

గూగుల్ పే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్ ఉపయోగించవద్దని, అసలీ యాప్‌ను ఓపెన్‌లోనే ఉంచవద్దని గూగుల్ సూచిస్తోంది. సైబర్ నేరగాళ్లు యూజర్ల మొబైల్‌లోని గూగుల్ పే నుంచి ఆర్ధిక లావాదేవీల వివరాలు సేకరించి ఎక్కౌంట్ ఖాళీ చేస్తున్నట్టుగా గూగుల్ గుర్తించింది. అందుకే తన యూజర్లు నష్టపోకుండా కాపాడేందుకు ఈ సూచనలు జారీ చేసింది. మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డుకునేందుకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని గూగుల్ తెలిపింది.

ప్రస్తుతం అన్ని రకాలుగా మోసాలు పెరిగిపోతున్న క్రమంలో గూగుల్ పే యాప్ ద్వారా జరిగే లావాదేవీలల్లో మోసాలు జరగకుండా తమ వంతు కట్టడి చేస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. అందుకే యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా యాప్ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్ వాడవద్దని కోరుతోంది. అదే సమయంలో థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోమని గూగుల్ పే ఎప్పుడూ అడగదని తెలిపింది. స్క్రీన్ షేరింగ్ యాప్ ఉపయోగిస్తే సైబర్ నేరగాళ్లు ఈ యాప్ ద్వారా మీ తరపున లావాదేవీలు చేసేందుకు డివైస్ మీ నియంత్రణలో తీసుకోవచ్చు. మీ డెబిట్ కార్డు వివరాలు, ఫోన్‌కు పంపించిన ఓటీటీతో మీ ఎక్కౌంట్ తస్కరించవచ్చు.

Also read: IRCTC Online Ticket Booking: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా..? ఎంత రీఫండ్ వస్తుంది..? క్యాన్సిలేషన్ రూల్స్ ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News