Ghee Being Made From Animal Fat: సాధారణంగా నెయ్యి ఆవు పాలు లేదా గేదె పాల నుండి తయారు చేస్తారు, ఈ ప్రాసెస్ చాలా కష్టం కావడంతో రేటు కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ఈ మధ్య తక్కువ రేటుకు కూడా నెయ్యి దొరుకుతుంది, అయితే ఈ నెయ్యి జంతువుల ఎముకల నుంచి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అసలు విషయం ఏమిటంటే బుధవారం అర్థరాత్రి హర్యానాలోని హిసార్‌లోని మదీనా టోల్ పిలాజా సమీపంలోని క్యాంటర్‌లో పశువుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత గురువారం ఉదయం హిసార్ నగరానికి ఆనుకుని ఉన్న బీడ్ ప్రాంతంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ధంధూర్ గ్రామ సమీపంలో ఈ నెయ్యి భారీ ఎత్తున లభ్యమైంది. దానిని తయారు చేస్తున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఓ పెద్ద పాత్రలో జంతువుల కొవ్వు పోలీసులు గుర్తించారు, అలాగే అమ్మకానికి సిద్ధం చేసిన నెయ్యి కూడా కనుగొనబడింది. ఇక ఆ పక్కనే చనిపోయిన జంతువులు, వాటి ఎముకలు చుట్టూ పడి ఉన్నాయి. ఇక జంతువుల చర్మం, మాంసం వలించేందుకు వాడే కోసం ఉపకరణాలు కూడా కనుగొనబడ్డాయి. ప్రస్తుతానికి పశు సంవర్ధక శాఖ వైద్యులు నెయ్యి నమూనాలను తీసుకున్నారు.
ఈ విషయం మీద గౌ రక్షా దళ్ సభ్యుడు ఖాజన్ సింగ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు ఈ నెయ్యిని మార్కెట్‌లో 100 నుంచి 200 రూపాయలకు అమ్మే వారని తక్కువకే లభిస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఈ నెయ్యిని పూజకు ఉపయోగిస్తారని అన్నారు. ఇక పశువులను అక్రమంగా తరలిస్తున్నారని, మాంసం కోసం జీవాలను వధిస్తున్నారని గో సేవకులు ఆరోపిస్తున్నారు.
ఇక బీడ్ ప్రాంతంలో జంతువుల కళేబరాలు, ఎముకలు పడి ఉన్నాయి. అదే సమయంలో పశుసంవర్ధక శాఖ వైద్యులు నెయ్యి నమూనాలను తీసుకున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అయింది. సో ఇక మీదట తక్కువ రేటుకు నెయ్యి లభిస్తుంది అని ఏది పడితే అది కొనేసి ఇబ్బంది పడకండి.
Also Read: Varisu Art director: సినిమా విడుదలకు వారం ముందు విషాదం.. 'వారసుడు' ఆర్ట్ డైరెక్టర్ మృతి!
Also Read: Thalapathy Vijay Divorce: భార్యకు విడాకులివ్వనున్న స్టార్ హీరో విజయ్.. అసలు విషయం ఏమిటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Ghee From Animal Fat: తక్కువ రేటుకే నెయ్యి దొరుకుతుందని లొట్టలేస్తూ తింటున్నారా.. ఇది చదివితే ఇక ముట్టుకోరు!