Medak Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Four Killed In Road Accident: తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మెదక్ జిల్లాలో ఆటోను కారు ఢీకొట్టడంతో నలుగురు స్పాట్‌లోనే మృతిచెందారు. జగిత్యాలలో మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 21, 2023, 09:56 AM IST
Medak Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Four Killed In Road Accident: మెదక్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ శివారులో ప్రయాణికులతో వెళ్తును ఆటోను ఓ కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నార్సింగ్ నేషనల్ హైవేపై ఆర్మూర్ నుంచి గజ్వేల్ వెళ్తుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులను తండ్రీకొడుకులు శేఖర్‌, యశ్వంత్‌ (9), భార్యాభర్తలు బాలనర్సయ్య, మణెమ్మగా గుర్తించారు. వీరు ఆర్మూర్ మండలం ఏలూరు వాసులులను పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరో ప్రమాదంలో ఇద్దరు..

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పుడూరు-దొంగలమర్రి వద్ద మామిడి కాయల లోడుతో వెళ్తున్న మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. మామిడి కాయల లోడుతో పాటు వాహనంలో 11 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయనపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. గూడ్స్ వ్యాన్ టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మామిడి కాయలు తెంపి.. తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులను సునీత, మమతగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: 2000 Rupees Note: బ్యాంక్‌కు వెళ్లకున్నా రూ.2000 నోట్లను ఇలా మార్చుకోండి..!  

Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News