Crane Accident In Indore: ఇండోర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బద్ గంగా ప్రాంతంలో క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చించారు. రెండు బైకులు అదుపుతప్పి క్రేన్ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. క్రేన్ కింద బైకులు పడిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు క్రేన్ కింద నలిగిపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా..
రీపేర్‌కు గురైన బస్సును తీసుకుని ఓ క్రేన్ బంగంగా ప్రాంతం గుండా వెళుతోంది. ఈ క్రమంలో క్రేన్‌ను కారు ఓవర్ టేక్ చేసేందుకు యత్నించగా.. క్రేన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో రెండు బైక్‌లపై క్రేన్‌ను ఎక్కించాడు. దీంతో నలుగురు క్రేన్ కింద పడి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రితేష్ కిషోర్ (16), శరద్ కిషోర్ (6), రాజ్ చంగిరామ్ (13), సునీల్ పర్మార్ (56)గా గుర్తించారు. గాయపడిన మహిళ శారదా కిషోర్ (40)ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. క్రేన్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటన అనంతరం క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు కోపోద్రిక్తులైన క్రేన్‌ను చుట్టుముట్టారు. ప్రజలను చెదరగొట్టిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఒకేసారి నలుగురు మరణించడం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. క్రేన్ డ్రైవర్‌పై సెక్షన్లు 304ఏ,ఇతర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట రద్దీగా ఉన్న సమయంలో మరమ్మతుకు గురైన బస్సును క్రేన్ ఎలా తీసుకువెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. క్రేన్ డ్రైవర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతను దొరికితే మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read: CM KCR: కల్లుగీత కార్మికులకు శుభవార్త.. ప్రత్యేక పథకం ప్రకటించిన సీఎ కేసీఆర్
Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Indore Crane Accident: ఘోర విషాదం.. క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం