Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు

Explosion at Firecracker in Tamil Nadu: తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2023, 12:24 PM IST
Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు

Explosion at Firecracker in Tamil Nadu: తమిళనాడులోని బాణసంచా నిల్వ చేసే గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..  మరో 10 మంది గాయపడ్డారు. కృష్ణగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నివాల మధ్య బాణాసంచా గోదాం ఉండగా.. పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలిపోయాయి. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. గాయపడిని వారిని ఆసుపత్రులకు తరలించారు. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సంయుక్తంగా జిల్లా పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

మరో ఐదుగురు వ్యక్తులు గోడౌన్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఇళ్లు కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు బాధితులు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని కృష్ణగిరి పోలీసు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. మంగళవారం విరుదునగర్ జిల్లా శివకాశిలోని బాణాసంచా యూనిట్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్  

Also Read: Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం.. 8 మంది జలసమాధి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News