Crucial Update on Pandav Nagar Anjan Das Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యకేసు తరహాలో మరో ఘటన తెరపైకి వచ్చిందన్న సంగతి తెలిసిందే. భార్య పూనమ్ దేవి (48) కొడుకు దీపక్ (25)తో కలిసి తన భర్త అంజన్ దాస్(48)ని కత్తితో 35 సార్లకు పైగా పొడిచి హత్య చేసిందని పోలీసులు తేల్చారు. నిందితులిద్దరూ మొదట శరీరం నుండి రక్తం బయటకు వచ్చేలా చేసి ఆ తరువాత అతని మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్స్ లో ప్యాక్ చేసి ఫ్రీజ్‌లో ఉంచారని ఆ తరువాత, మూడు-నాలుగు రోజుల పాటు, మృతదేహం ముక్కలను త్రిలోక్‌పురి, పాండవ్ నగర్‌లలో వివిధ ప్రదేశాల్లో విసిరారని గుర్తించారు.
పాండవ్ నగర్‌లో లభించిన మానవ శరీర భాగాలను సిసిటివి ఫుటేజీ సహాయంతో ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సోమవారం తల్లి-కొడుకు ఈ పని చేశారని గుర్తించి అరెస్టు చేసింది. అయితే అంజన్ దాస్ మృతదేహంలోని ఆరు ముక్కలు లభించాయి. నిందితులను రిమాండ్‌కు తరలించి మిగిలిన నాలుగు మృతదేహాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. వితంతువు అయిన తన సవతి కూతురు, సవతి కుమారుడు దీపక్ భార్యను అంజన్ దాస్ చెడుగా చూసేవాడని నిందితులు చెబుతున్నాడు. వారిద్దరినీ వేధించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని అతని చేష్టలు శృతి మించడంతో అతన్ని చంపేశామని నిందితులు చెబుతున్నారు.
జూన్ 5న పాండవ్ నగర్‌లోని రాంలీలా మైదాన్‌లో పాదాల ముక్కలు కనిపించాయని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఆ తరువాత, కొన్ని రోజులకు మానవ శరీరానికి సంబంధించిన మరిన్ని ముక్కలు దొరికాయి, అయిదు ఇవి శ్రద్ధా మృతదేహం ముక్కలుగా భావించి సౌత్ జిల్లా పోలీసులు తూర్పు జిల్లా పోలీసులను సంప్రదించారు. ఫోరెన్సిక్ పరీక్షలో అవి మగవాడికి చెందినవని తేలడంతో పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అంతేకాక దర్యాప్తు ప్రారంభించడంతో మే 31 - జూన్ 1 మధ్య రాంలీలా మైదాన్ -అశోక్ విహార్ మురికి కాలువ మరియు ఇతర ప్రదేశాలలో ఒక మహిళతో కలిసి మరియు ఒక వ్యక్తి ఈ శరీర భాగాలను విసిరినట్లు పోలీసు బృందం CCTV ఫుటేజీ ద్వారా తెలుసుకున్నారు.
విచారణ చేయగా అంజన్ దాస్ ఆరు నెలలుగా కనిపించకుండా పోయినట్లు తేలింది. అతని కోసం కుటుంబ సభ్యులు మిస్సింగ్ రిపోర్టు ఇవ్వలేదని తెలిసి అంజన్ భార్య పూనమ్, కుమారుడు దీపక్‌లను ఇన్‌స్పెక్టర్ రాకేష్ శర్మ ప్రశ్నించారు. నేరం జరిగిన సమయంలో ధరించిన బట్టలు స్వాధీనం చేసుకున్న తర్వాత అంజన్ దాస్‌ను హత్య చేసినట్లు ఇద్దరూ అంగీకరించారు. వాళ్లు అంజన్ ను నరికిన కత్తి, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు నాలుగు రోజుల రిమాండ్‌కు తరలించారు. కొడుకు దీపక్‌తో కలిసి భర్త అంజన్‌దాస్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితురాలు పూనమ్ మే 30వ తేదీ రాత్రి అంజన్ దాస్‌కు మద్యంలో నిద్రమాత్రలు తాగించారు.
అతను అపస్మారక స్థితిలో ఉండగా గదిలోనే కత్తితో ఆమె మెడపై పొడిచాడు. నిందితులు అంజన్ మెడపైనే కత్తి (డ్రాగన్)తో 25కు పోట్లకు పైగా పొడిచారు. ఆ తర్వాత, అతని శరీరంలోని ఇతర భాగాలపై కత్తితో దాడి చేశారు. మృతదేహాన్ని రక్తస్రావమయ్యేలా వదిలేశారు. మే 31వ తేదీ మధ్యాహ్నం గదిలోని రక్తాన్ని సేకరించి బాత్‌రూమ్‌లో వేసి అంజన్‌దాస్ మృతదేహాన్ని కత్తితో 10 ముక్కలుగా నరికారు. మే 31 రాత్రి, వారు మృతదేహం ముక్కలను బయట విసరడం మొదలుపెట్టారు. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధా తలను ఎలా విసిరాడో, అదే విధంగా పూనమ్ మరియు దీపక్ కూడా ఆ తర్వాత అంజన్ దాస్ తలను విసిరారు. వీరు ముందు తలలు విసిరితే వాటి ద్వారా మనిషిని గుర్తిస్తారని అలా ఇద్దరూ పట్టుబడతారని అనుకునేవారని భావించి నిందితులు అంజన్ దాస్ తలను భూమిలో పాతిపెట్టారని తేలింది.
Also Read: The Kashmir Files సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్.. క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook