Buffalo Theft Case: 1965లో గేదెలు దొంగతనం.. 58 ఏళ్ల తరువాత దొరికిన దొంగ

Man Arrested in Buffalo Theft Case: కర్ణాటకలో వింత కేసు వెలుగు చూసింది. 1965లో గేదెలు దొంగతనం చేసిన కేసులో 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అప్పట్లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని.. కోర్టు విచారణకు డుమ్మా కొట్టగా.. తాజాగా పాత కేసులు వెలికి తీసి పోలీసులు అరెస్ట్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 08:08 PM IST
Buffalo Theft Case: 1965లో గేదెలు దొంగతనం.. 58 ఏళ్ల తరువాత దొరికిన దొంగ

Man Arrested in Buffalo Theft Case: మీరు ఎన్నో కేసులు చూసుంటారు.. టీవీల్లో, పత్రికల్లో చదివి ఉంటారు. కానీ ఈ విచిత్ర కేసు మాత్రం ఎక్కడా చూసుండరు. 58 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు దొంగను పట్టుకుంటే ఎలా ఉంటుంది..? అదీ కూడా గేదేల దొంగతనం కేసులో.. ఇప్పటికే దొంగతనానికి గురైన గేదెలు కూడా చనిపోయి ఉంటాయి. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 58 ఏళ్ల క్రితం గేదేలు దొంగతనం కేసులో తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాలు ఇలా.. 1965 ఏప్రిల్ 25న బీదర్ జిల్లా భాల్కీ తాలూకా మెహకర్ గ్రామంలో రెండు గేదెలు, ఒక గేదె దూడను దొంగతనానికి గురయ్యాయి. వాటి యాజమాని మురళీధర్ మాణికరావు  అదే రోజు మెహకర్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని తకల్‌గావ్ గ్రామానికి చెందిన గణపతి విఠలే వాఘ్‌మోర్ తన గేదేలు దొంగతనం చేసినట్లు చెప్పాడు. అప్పటికి వాఘ్‌మోర్ వయసు 20 ఏళ్లు. అప్పుడు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కస్టడీకి తరలించారు. అయితే కస్టడీలో పోలీసుల నుంచి తప్పించుకుని.. కోర్టు విచారణకు డుమ్మా కొట్టాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకలేదు. దీంతో ఈ కేసు అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించేందుకు బీదర్ జిల్లా ఎస్పీ ఎల్‌ఎస్ చన్నబసవన్న ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు వాఘ్‌మోర్‌ను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఉదయగిరిలో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుగా.. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా పోలీసులు అనుకోకుండా అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిందితుడు వయసు 78 ఏళ్లు. అతనికి స్నేహితుడు కృష్ణ చంద్ర దొంగతనానికి సహకరించాడు. అయితే అతను 2006లో మరణించాడు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు ఇప్పటికీ క్లోజ్ అయింది. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.  

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలు అంతర్రాష్ట్ర నేరాలకు పేరుగాంచాయి. 50, 70లలో ఇలాంటి దొంగతనాలు ఎన్నో జరిగేవి. గేదెలు, దూడను దొంగిలించిన కేసులో 58 ఏళ్ల తరువాత వృద్ధుడిని అరెస్ట్ చేయడం వైరల్‌గా మారింది. 

Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు  

Also Read: Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News